ఓటీటీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఆపేయడానికి అసలు కారణం అదేనా..?

తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 ముగిసిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత హోస్ట్ నాగార్జున ఈసారి ఓటీటీ లో బిగ్ బాస్ ఉండదు అని, ఒకవేళ ఉన్నా కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఉండదు అని ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే నాగార్జున మాటలను బట్టి చూస్తే బిగ్ బాస్ షో ని బుల్లితెర పైనే ప్రసారం చేయబోతున్నారన్నమాట. అందుకు గల కారణం ప్రస్తుతం ఓటీటీ లో వస్తున్న సినిమాలు వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఉంటుంది. అందువల్లే బిగ్ బాస్ నాన్ స్టాప్ ని లైవ్ లో చూడటం అనేది సాధ్యం కాలేదు.

అంతేకాకుండా బిగ్బాస్ షో ని 24 గంటలపాటు చూడటానికి కూడా ప్రేక్షకులు కూడా ఆసక్తిని కనబరచడం లేదు. ఈ బిగ్ బాస్ సీజన్ 1 వల్ల బిగ్ బాస్ ప్రేమికులకు మొబైల్ ఛార్జింగ్ అలాగే మొబైల్ లో డేటా అనేది అయిపోవడం తీవ్ర అసంతృప్తి పరిచింది. ఇక ఒకరోజు ముందుగానే లైవ్ కట్ చేయడం, ముందుగానే లైవ్ లో ఏం జరుగుతోంది అనేది సోషల్ మీడియా ద్వారా తెలిసిపోవడం వల్ల ఈ షోపై ఆసక్తి తగ్గిపోయింది. దీనివల్ల బిగ్ బాస్ నాన్ స్టాప్ లైవ్ అనేది ఫెయిల్ అయ్యిందనే చెప్పవచ్చు.

దీనితో ఇప్పుడు నాన్ స్టాప్ 24×7 లైవ్ నీ ఆపేశారు. ఇక సీజన్ 2 అనేది ఓటీటీలో వేరేవిధంగా డిజైన్ చేస్తారా? లేకపోతే ఓటీటీ సీజన్ ని ఆపేస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇకపోతే తాజాగా అందిన సమాచారం ప్రకారం అయితే, సీజన్ 2ని వేరే విధంగా ఆలోచించి చేస్తారట. మరోవైపు స్టార్ మాటివిలో బిగ్ బాస్ సీజన్ 6కి సన్నాహాలు నడుస్తున్నాయి. టెలివిజన్ లో టెలికాస్ట్ కాబట్టి ఖచ్చితంగా స్పాన్సర్స్ కి కొదవ ఉండదు అని చెప్పవచ్చు.