టైటిల్ లో చెప్పిన సామెతకు సరిగ్గా సరిపోయే పనులు చేస్తున్నాడు ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ పార్టీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు. తమ రాజకీయ మిత్రుడు పవన్ కళ్యాణ్ ను సిబిఐ నేత నారాయణ విమర్శించిన విషయం తెలిసిందే, వాటిపై కనీసం జనసేన నేతలు ఎవరు పెద్దగా స్పందించలేదు, కానీ సోము వీర్రాజుకు ఎక్కడ లేని కోపం వచ్చింది, సిబిఐ నారాయణకు గట్టి హెచ్చరికలు పంపించాడు
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. 2019 ఎన్నికల్లో ఎందుకు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. మీరు పొత్తులు పెట్టుకొని పార్టీ దేశంలోనే లేదంటూ విరుచుకుపడ్డాడు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ నిబద్ధత గురించి కూడా సోము చెప్పుకొచ్చాడు. మిత్రుడు కదా ఆ మాత్రం మద్దతు అవసరం అందులో తప్పేమి లేదు. అయితే సొంత పార్టీలో రాష్ట్ర స్థాయి నుండి జాతీయస్థాయి నాయకురాలుగా ఎదిగిన పురందేశ్వరిని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కులం కార్డు ఉపయోగించి దారుణమైన కామెంట్స్ చేసినప్పుడు సోము వీర్రాజు కనీసం దానిని ఖండించిన పాపాన పోలేదు. ఎదో నారాయణ తనకు అలవాటైన మాటలతో పవన్ కళ్యాణ్ ఒక మాట అనే సరికి రెచ్చిపోయిన సోము వీర్రాజు, తమ పార్టీ జాతీయ నాయకురాలును కించపరిచే విధంగా అధికార పక్షం మాట్లాడితే ఒక్క మాట కూడా అనలేకపోయాడు. ఇక్కడే సోము వీర్రాజు నిబద్దత మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బీజేపీ పార్టీలో ఒక వర్గం తెలుగుదేశానికి, మరో వర్గం వైసీపీ కి మద్దతు ఇస్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి, సోము వీర్రాజు వైసీపీ మద్దతు వర్గానికి చెందిన నేత అనే ఆరోపణలు కూడా వున్నాయి, వాటిని నిజం చేసే విధంగానే సోము వీర్రాజు చర్యలు కనిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతపై విమర్శలు వస్తే చూసి చూడనట్లు వెళ్లిన సోము, పవన్ మీద విమర్శలు రాగానే రెచ్చిపోవటం విడ్డురం. సోము వీర్రాజు ప్రవర్తనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తుంది. ఇకనైనా సోము వీర్రాజు తన ఆలోచన విధానం మార్చుకుంటే మంచిది, లేకపొతే అయన విధానాలు పార్టీకి తీరని నష్టం కలిగిస్తాయనే మాటలు వినిపిస్తున్నాయి