మెగా డాటర్ శ్రీజ కొణిదెల గత కొంత కాలం నుంచి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె తన భర్త కళ్యాణ్ దేవ్ నుంచి దూరంగా ఉండటమే అందుకు కారణం. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న శ్రీజ రెండవ పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లిలో కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చి అనంతరం ఈమె తన భర్తకు దూరంగా ఉంటున్నారు. ఇలా తన భర్తకు దూరంగా పిల్లలతో కలిసి ఉండగా త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని పెద్దఎత్తున వార్తలు సృష్టిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ విషయం గురించి కళ్యాణ్ దేవ్ లేదా శ్రీజ ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడివిడిగా ఉంటూ విడాకుల విషయం గురించి క్లారిటీ ఇవ్వకపోవడంతో నిత్యం ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే శ్రీజ కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.తన వ్యక్తిగత జీవితం గురించి బాధ పడిన శ్రీజ ఆ బాధ నుంచి బయటకు రావడం కోసం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
గతంలో ఈమె తన భర్తతో కలిసి ఉన్నప్పుడు తనకు పెద్దగా వంటలు చేయడం రాదని ఎక్కువగా వంటగది వైపు వెళ్లదని కళ్యాణ్ దేవ్ చెప్పుకొచ్చారు.అయితే ప్రస్తుతం ఈమె వంటగదిలో ఎక్కువ సమయం గడుపుతూ వివిధ రకాల వంటకాలను ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా వంట చేస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ నేను ఏం వంట చేస్తున్నానో కనుక్కోండి అంటూ ఫోటోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో శ్రీజ డిప్రెషన్ నుంచి బయటకు రావడం కోసమే ఇలా చేస్తున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు.