Prabhas : ఇండస్ట్రీ టాక్ : ప్రభాస్ 100 కోట్ల చాప్టర్ అయ్యిపోయిందా?అప్పుడే కాదు..!

Prabhas : తనకి వచ్చిన స్టార్డం ని ఎలా వినియోగించుకోవాలో తెలియకపోతే మన స్టార్ హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ లని చూసి చెప్పొచ్చు. ఎంతసేపు కొత్త దర్శకులు చిన్న దర్శకులకి అవకాశాలు ఇస్తారన్న మాట పక్కన ఉంచితే అందరూ ఈ రకంగా సక్సెస్ కాలేరని చెప్పాలి. అలా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పరిస్థితి కాస్త తడబడింది.
బాహుబలి ఇచ్చిన స్టార్డం తో ప్రభాస్ చాలా హైట్స్ కి వెళ్ళాడు. దానితోనే సాహో అనే సినిమా తీసి ఫస్ట్ డే కే 100 కోట్లు కొల్లగొట్టి తన దమ్ము ఏంటో చూపించాడు. దీనితో రాధే శ్యామ్ తో కూడా ఇలాగే ఫస్ట్ డే 100 కోట్లు అందుకుంటాడని అంతా ఆసక్తిగా అనుకున్నారు. కానీ ఎందుకో రాధే శ్యామ్ షాకింగ్ వసూళ్లు ఓపెనింగ్ రోజు అందుకొని 70 కోట్లతోనే సరిపెట్టుకుంది.
అయితే దీనికి కారణం హిందీ మార్కెట్ లో ఈ సినిమా అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ అందుకోకపోవడమే అని చెప్పాలి. దీనితో ప్రభాస్ పై ఉన్న 100 కోట్ల మార్క్ పడిపోయింది, ఇక ప్రభాస్ పని అయ్యిపోయినట్టే అని ఆల్రెడీ ఓ వర్గం టాక్ స్టార్ట్ చేశారు. అయితే ఈ చాప్టర్ ఇక్కడితో అయ్యిపోలేదని చెప్పాలి.
ఇది అంటే క్లాస్ సినిమా కాబట్టి కాస్త అటు ఇటు అయ్యింది కానీ తర్వాత సినిమాలతో మాత్రం ప్రభాస్ అసలైన మాస్ చూపిస్తాడని చెప్పాలి. “సలార్”, “ఆదిపురుష్” లాంటి సాలిడ్ రీచ్ ఉన్న సినిమాలు చేస్తూ పైగా మంచి ఫేమ్ ఉన్న దర్శకులతో కావడం బిగ్ ప్లస్ అని చెప్పాలి.
దీనితో మాత్రం మళ్ళీ కింగ్ ప్రభాస్ తన 100 కోట్ల చైర్ లో కూర్చోవడం పక్కా అని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్న మాట. సో అప్పటి వరకు ఆగి వేచి చూడాల్సిందే. అప్పుడు తెలుస్తుంది అసలైన ప్రభాస్ స్టామినా. ప్రస్తుతానికి అయితే రాధే శ్యామ్ కి నష్టాలు తప్పేలా లేవు.