Pooja Hegde : వైరల్ : పూజా వేసింది ప్రభాస్ రియల్ లైఫ్ పై సెటైరేనా..?

Pooja Hegde : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ చిత్రాల్లో ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమా “రాధే శ్యామ్” దాదాపు మూడేళ్ళ నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. మరి ఆ ఎదురు చూపులై తగ్గట్టుగానే మైండ్ బ్లోయింగ్ విజువల్స్ మరియు ప్రపంచ స్థాయి కథాంశం తోనే ఈ చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించాడు.

మరి ఈ భారీ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ఏ అప్డేట్ కూడా నిరాశ పరచలేదు. దీనితో మరిన్ని అంచనాలు నెలకొనగా రీసెంట్ గా చిత్ర బృందం ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒక వీడియో ని రిలీజ్ చేసారు. దీనికి మంచి రెస్సాన్స్ కూడా వచ్చింది.

అయితే ఇందులోనే ప్రభాస్ పై పూజా హెగ్డే వేసిన ఒక సెటైర్ ఓ రకంగా అతడి పర్సనల్ లైఫ్ కి కూడా టచ్ అయ్యేలా ఉందని అది చూసిన ఎవరికీ అనిపించక మానదు. అన్ని బాగానే ఉన్నాయి కానీ నీకు ఇంత వయసు వచ్చినా ఎందుకు పెళ్లి కాలేదు అనే మాట సినిమాలో కాస్త ఫన్నీ గానే ఉన్నా ప్రభాస్ విషయంలో మాత్రం ఇది అభిమానులకి కాస్త ఎక్కడో గుచ్చుకునే మాటే అని చెప్పాలి.

ఎందుకంటే ఇది నిజమే కాబట్టి టాలీవుడ్ లో ఉన్న ఏకైక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ తన పెళ్లి ఎప్పుడు అవుతుందా అని చూస్తుంటే అది పక్కకెళ్లి సినిమాలు వస్తున్నాయి. దీనితో ఈ డైలాగ్ ఇప్పుడు ఇలా సింక్ అవ్వడం అభిమానుల్లో ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.