సూపర్ స్టార్ కోసం బీజేపీ పడిగాపులు

janasena pawan kalyan

 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రశాంతంగా తన సినిమాలు తాను చేసుకుంటూ, అప్పుడప్పుడు మోడీ ఏమైనా పధకాలు లేదా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే వాటిని సమర్థిస్తూ సోషల్ మీడియాలో ఒకటి అరా పోస్ట్లు చేస్తూ రాజకీయంగా ముందుకు వెళ్తున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ మరోసారి ఎన్నికల బరిలో దించాలని తెలంగాణ బీజేపీ పార్టీ తీవ్రంగా కష్టపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికలు జరుగుతున్నా విషయం తెలిసిందే, ఇందులో బీజేపీ తరుపున రఘునందన్ పోటీ చేస్తున్నాడు.

pawan kalyan dubbaka telugu rajyam

  గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినా కానీ, నిరుత్సహం చెందకుండా అక్కడ గ్రామగ్రామాన తన వర్గాన్ని తయారుచేసుకున్నాడు. దీనితో ఈ ఎన్నికల్లో బీజేపీ కి గెలుపు అవకాశాలు ఉన్నాయనే నమ్మకం కలిగింది. దీనితో రాష్ట్ర స్థాయి నేతలందరూ ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. మరోపక్క ఆరెస్సెస్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. తెరాస కు పోటీగా బీజేపీ నేతలు గట్టిగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే హరీష్ రావును తట్టుకొని నిలబడాలన్న లోకల్ గా ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకోని వెళ్లి, కార్యకర్తల్లో ఉత్సహాన్ని నింపాలన్న ఇప్పటికిప్పుడు ఒక స్టార్ క్యాంపెనర్ అవసరం పడింది. దీనితో పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించాలని బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు భావిస్తున్నారు,

  పవన్ కళ్యాణ్ ను ప్రచారానికి ఒప్పించాలంటే ఇక్కడి నేతలకు కష్టమైన పని. కచ్చితంగా ఢిల్లీ స్థాయి నుండి మంతనాలు జరిగితేనే పవన్ కళ్యాణ్ వస్తాడు. అందుకోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ పెద్దలతో దీని గురించి మాట్లాడినట్లు బొగుట్టు, అదే సమయంలో పవన్ కళ్యాణ్ వస్తే దానికి కావాల్సిన రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి సినిమా షూటింగ్స్ లేకపోవటంతో ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో పవన్ కళ్యాణ్ బీజేపీ తరుపున ప్రచారానికి రావటం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. మరి బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి జనసేన అధినేతను ఒప్పిస్తే, మనం మరోసారి పవన్ మార్క్ ప్రసంగాలు వినొచ్చు..