టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేరెత్తితే వైకాపా మంత్రి కొడాలి నాని ఒంటికాలుపై లేచిపడతారు. చంద్రబాబు నాయుడు ప్రస్తావన రావడమే ఆలస్యం నాని అగ్గిమీద గుగ్గిలమైన సందర్భాలు కోకల్లలు. ఒకప్పుడు చంద్రబాబు వెంట ఉండి..ఆయన కొమ్ము కాసిన నాయకుడిగా పేరు గాంచిన నాని ఇలా ఒక్కసారిగా ఊహించని టర్నింగ్ తీసుకుని జగన్ మోహన్ రెడ్డికి బాగా చేరువయ్యారు అన్నది తెలిసిందే. నాటి నుంచి చంద్రబాబు అంటే! వైకాపా మంత్రి మరింత ద్వేషిచడం అనేది యధేశ్చగా సాగుతోంది. చంద్రబాబుపై వ్యక్తిగతంతో పాటు రాజకీయ విమర్శలు నాని తరుచూ చేస్తూనే ఉంటారు.
తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలతో కొడాలి నాని వార్తల్లో అగ్ర పథాన నిలిచారు. చంద్రబాబుకి స్వార్థ ప్రయోజనాలు తప్ప…పార్టీ ప్రయోజనాలు ఆయనకు తెలియవన్నారు. చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకున్నా ఎవరికీ ఏ ఉపయోగం ఉండదని..చివరికి కమ్మోళ్లను కూడా ఎలా వాడాలో బాగా తెలిసిన నాయకుడని ఎద్దేవా చేసారు. ఆయన వ్యక్తిగత పనులకు క మ్మోళ్లను ఎలా వాడతారు అన్నది ఆ బాధితులకు బాగా అర్ధమవుతుందని మండిపడ్డారు. దీనిపై సందేహాలుంటే జూనియర్ ఎన్టీఆర్ ని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకోవచ్చారు. మొత్తానికి నాని చంద్రబాబు కింద పెద్ద కుంటపే పెట్టారని తాజా వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ పేర్లను ఆ రకంగా ఇప్పటివరకూ ఎక్కడా ప్రస్థావనకు తీసుకురాలేదు. అంటే చంద్రబాబు కుళ్లు రాజకీయాల గురించి వాళ్లిద్దరికీ కూడా బాగా తెలసుననే కదా. అంటే పార్టీలో నాయకుల ముధ్య చిచ్చు రేపే అంశంగా దీన్ని చెప్పుకోవచ్చు అని కొందరి వాదన. ఇప్పటికే పార్టీ పెత్తనం తనయుడు లోకేష్ నెత్తిన చంద్రబాబు పెడుతున్నారని కొంత మంది నేతలు అలక పానులెక్కిన సంగతి తెలిసిందే. అలాగే ఇంకొంత మంది పార్టీని వదల్లేక..ఉండలేక ఇబ్బంది పడుతున్నారు. నిజంగా లోకేష్ ని అందలం ఎక్కిస్తే గనుక టీడీపీ పరిస్థితి? ఏంటి అన్న సొంత పార్టీ నేతలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో కొడాలి తాజా వ్యాఖ్యలు పార్టీలు దుమారం రేపకపోయే అవకాశం లేకపోలేదు. మరి వీటికి చంద్రబాబు ఏమని బధులిస్తారో.