2024 ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. 2019 సంవత్సరంలో 151 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించినా గత రెండేళ్లలో వైసీపీపై ప్రజల్లో కొంతమేర వ్యతిరేకత అయితే పెరిగింది. సంక్షేమం విషయంలో వైసీపీకి మంచి మార్కులు పడుతున్నా అభివృద్ధి విషయంలో మాత్రం నెగిటివ్ మార్కులు పడుతున్నాయి. జగన్ మూడు రాజధానుల ప్రకటన ప్రజలకు సంతోషం కలిగించినా మూడు రాజధానుల అభివృద్ధి ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
మరోవైపు పవన్ కళ్యాణ్ గురించి సీఎం జగన్ పదేపదే ప్రస్తావించడంతో పవన్ కళ్యాణ్ ను చూసి సీఎం జగన్ భయపడుతున్నారా? అనే చర్చ ప్రజల మధ్య జోరుగా జరుగుతోంది. అయితే ఇదే సమయంలో పవన్ వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చుతానని చెప్పినా చంద్రబాబు పాలన కంటే జగన్ పాలన మెరుగ్గా ఉండటం జగన్ కు కలిసొచ్చే అంశమని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా 2024లో వైసీపీనే అధికారంలోకి రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే వైసీపీ 2019 ఎన్నికల నాటి ఫలితాలను మాత్రం సాధించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ కూడా ప్రజల్లోకి రావడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుకునే అభివృద్ధి ఏపీలో జరిగితే మాత్రం పార్టీకి కచ్చితంగా ప్లస్ అవుతుందని విశ్లేషకుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తే వైసీపీకి మెజారిటీ తగ్గుతుందని మాత్రమే జగన్ భయపడుతున్నారని తెలుస్తోంది.
గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగుల మద్దతు, ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ఉండటం జగన్ కు ఒకింత ప్లస్ అవుతోంది. అయితే ఏపీ సీఎం జగన్ కు ఊహించని షాక్ అంటూ ఏపీ అప్పుల గురించి ప్రచారంలోకి వస్తున్న వార్తలు మాత్రం ప్రజలను ఒకింత కలవరపెడుతున్నాయి. ఏపీ అప్పులను వీలైనంత తగ్గించే దిశగా జగన్ అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.