గత రాత్రి హైదరాబాద్ లోనీ టీవీ-5 కార్యాలయంపై దుండగులు రాళ్లు రువ్విన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంత మంది దుండగులు మూకుమ్మడిగా ఒకేసారి దాడి చేయడంతో కార్యాలయం అధ్దాలు ధ్వసం అయ్యాయి. దీంతో సదరు యాజమాన్యం దుండగుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహం చెందారు. దాడిని ఖండిస్తున్నా. రాళ్ల దాడి అనేది పిరికి పంద చర్య. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియాపై దాడులు చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలని ఆగ్రహం వ్యక్తం చేసారు.
పత్రికా స్వేచ్ఛని హరించే విధంగా జరుగుతోన్న దాడులపై ఐక్యంగా పోరాటం చేయాలంటూ పిలుపునిచ్చారు. అయితే చినబాబు చాలా రోజుల తర్వాత ఇలా మీడియా ముందుకు రావడంతో షరా మామూలుగా నెటి జనులు కామెంట్లు గుప్పించడం మొదలు పెట్టారు. పచ్చ మీడియాపై దాడులు జరిగినప్పుడే చినబాబుకి ఐక్యత గుర్తొస్తుందా? ఇప్పటివరకూ హైదరాబాద్ లో ఉన్న చిన్నపాటి ఛానెల్స్, పత్రికా సంస్థలపై ఎన్నిసార్లు దాడులు జరగలేదు? తెలుగు రాష్ర్టాలు ఒకే రాష్ర్టంగా ఉన్నప్పుడు…టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీడియాపై ఎన్నిసార్లు దాడులు జరగలేదు? తమకు బాకా కోట్టే ఛానల్స్…పత్రికలపై దాడులు జరిగినప్పుడు నాలుగో స్థంభంగా నిలిచే మీడియా గుర్తొస్తుందా? పత్రికా స్వేచ్ఛను అప్పుడెందుకు కాపాడటానికి ముందుకు రాలేకపోయారని తెలంగాణలోని చంద్రబాబు వ్యతిరేక వర్గం విమర్శలు గుప్పించింది.
రెండు రాష్ర్టాలు ఏర్పాటైనా మీడియాను గుప్పిట్లో పెట్టుకోవడంలో చంద్రబాబు అండ్ సన్ ది అందవేసిన చేయి అని విమర్శిస్తున్నారు. మీడియాను అడ్డుపెట్టుకుని రాజకీయం నడపడంలో తండ్రీకొడుకులిద్దరు మోస్ట్ సీనియర్లు అంటూ మండిపడుతున్నారు. తమ మీడియా సంస్థలపై దాడులు జరిగినప్పుడే ఐక్యత..మీడియా స్వేచ్ఛ గురించి గుర్తుకురావడం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే టీవీ-5 పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిచాల్సిందే. ఈ ఘటనికి పాల్పడిన వారిని శిక్షించాల్సిందేనని ఉద్ఘాటించారు.