చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ బిడ్డేనా?

ఏపీ-తెలంగాణ మ‌ధ్య మ‌ళ్లీ నీళ్ల యుద్ధం మొదలైన‌ సంగ‌తి తెలిసిందే. కృష్ణా జ‌లాలు మళ్లీ రెండు రాష్ర్టాల మ‌ధ్య చిచ్చు రేపుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నిటిని ఎత్తిపోత‌ల ప‌థకం ద్వారా త‌ర‌లించి రాయ‌ల‌సీమ స‌హా ఇత‌ర జిల్లాల‌ను సస్య శ్యామలం చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంక‌ల్పించి ప‌నిచేస్తోంది. దీంతో తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం అలా చేస్తే మాకు అన్యాయం జ‌రుగుతుందంటూ ప్ర‌భుత్వం అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసారు. అవ‌స‌ర‌మైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తామ‌ని తెలంగాణ సీఏం కేసీఆర్ హెచ్చ‌రించ‌డం జ‌రిగింది. దీనిపై ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా త‌న వివ‌ర‌ణ‌ని క్లియ‌ర్ గా ఇచ్చేసారు.

కృష్ణా బోర్డు త‌మ‌కు కేటాయించిన నీటిని మాత్ర‌మే తీసుకుంటున్నామ‌ని తెలిపారు. పొతిరెడ్డిపాడు ప్ర‌వాహ సామార్ధ్యాన్ని 80 వేల క్యుసెక్కులు పెంచాల‌ని, అలాగే గాలేరు-న‌గ‌రి ఎస్పార్బీసీ కాల్వ‌ను కూడా 30 వేల క్యుసెక్కుల సామార్ధ్యాన్ని పెంచాల‌ని నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం జీవో కూడా విడుద‌ల చేసింది. దీనిపై ఏపీ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేసారు. బీడు భూములుగా ఉండే పొలాలు…మంచి నీళ్లు లేక అవ‌స్థ‌లు ప‌డుతోన్న ప్ర‌జ‌ల‌కు ఈ కొత్త ప్రాజెక్ట్ ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంది. అయితే వైకాపా ప్ర‌భుత్వంపై ఎప్పుడూ విషం చిమ్మే విప‌క్ష‌నేత చంద్ర‌బాబు నాయుడు ఇలాంటి మంచి ప‌నులు చేస్తున్న‌ప్పుడు మాట సాయం చేయ‌క‌పోవ‌డం దౌర్భాగ్య‌మ‌నే అనాలి.

ఈ విష‌యంపై బాబును ఉద్దేశించి వైకాపా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేసారు. బాబు గారు శ్రీశైలం నుంచి రాయ‌ల‌సీమ‌కు నీటిని పంపించే జీవో నెంబ‌ర్ 203 మీ స్టాండ్ ఏంట‌ని ప్ర‌శ్నించారు. అడ్డ‌మైన విష‌య‌ల‌పై మాట్లాడే మీనోరు ఇప్పుడెందుకు పెగ‌ల‌డం లేదు? దీనిపై మాట్లాడ‌టానికి మీకు మ‌న‌సు రావ‌డం లేదా? మీరు రాయ‌ల‌సీమ బిడ్డేనా? లేక‌? ఉత్త‌రాంధ్ర వాసివా? అంటూ ఘాటుగా విమ‌ర్శించారు. విశాఖ ఎల్ జీ పాలిమ‌ర్స్ గ్యాస్ ఘ‌ట‌న‌పై….పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టించి ఇచ్చే ప్ర‌భుత్వ‌ వైఖ‌రిపై అన్ని రాజాకీయాలు చేయాల‌ని చూసారు. ఇప్పుడు కృష్ణా నీటి విష‌యంలో రాజ‌కీయాలు చేయ‌రా? అంటూ ప్ర‌శ్నించారు.