Bandla Ganesh : బండ్ల గణేష్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నాడా.?

Bandla Ganesh :  చిన్న కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, నిర్మాతగా ఏకంగా పవన్ కళ్యాణ్‌తో సినిమా రూపొందించగల స్థాయికి ఎదిగాడు బండ్ల గణేష్. నోరు చాలా పెద్దది. నిజాలే మాట్లాడుతాడు. కానీ, చాలా సూటిగా మాట్లాడేస్తుంటాడు. పవన్ కళ్యాణ్‌కి అరి వీరి భయంకరమైన భక్తుడు.

ఎప్పుడు వార్తల్లోకెక్కినా సంచలనమే ఆయన. అలాంటిది తాజాగా రాజకీయాలకు సంబంధించి, హాట్ హాట్‌గా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. నిజానికి బండ్ల గణేష్‌కి రాజకీయాలేం కొత్త కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున పని చేశాడు. మధ్యలోనే బయటికి వచ్చేశాడు. ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టాడు బండ్ల గణేష్.

అయినప్పటికీ, బండ్ల గణేష్‌కు రాజకీయంగా అన్ని పార్టీల్లోనూ సన్నిహితులున్నారు. కీలక పదవుల్లో వున్నవారితో  సైతం బండ్ల గణేష్ మంచి స్నేహ సంబంధాలు కొనసాగిస్తుంటారు. అయినా కానీ, రాజకీయాలంటే తనకు అస్సలు ఇంట్రెస్ట్ లేదని చెబుతున్నాడు బండ్ల గణేష్.

ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో అస్సలు తల దూర్చను అంటున్నాడు. తన దేవుడు, పవన్ కళ్యాణ్  ఒకవేళ పిలిస్తే, రాజకీయాల్లోకి వెళతారా.? అని అడిగితే, అప్పుడు కూడా రాజకీయాల జోలికి పోననీ, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే చూడాలనుకుంటున్నాననీ బండ్ల గణేష్ చెప్పారు.

పవన్ పిలిస్తే, రాజకీయాల్లోకి వెళ్లను కానీ, ఆయన అనుమతిస్తే, ఆయనతో మళ్లీ సినిమా రూపొందించడానికి రెడీగా వున్నానంటూ బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు.