AP Government Disappointed With Rajamouli : ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హిట్ గా నిలిచినటువంటి మోస్ట్ అవైటెడ్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) సక్సెస్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా దర్శకుడు రాజమౌళి నే ప్రధాన కారణం అని చెప్పాలి.
నిరంతరం చాలా శ్రమించి ఈ సినిమాని తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పుడు ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ టైం లో ఏపీలో మాత్రం టికెట్ ధరల అంశం పెద్ద తలనొప్పిగా మారగా దానైకి మెగాస్టార్ ముందుకు వచ్చి పెద్ద దిక్కుగా నిలిచి ప్రత్యేక అనుమతులు తీసుకు వచ్చారు.
అయితే ఆ సమయంలో ఈ సినిమా యూనిట్ చిరు తో సహా ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అయినా ఇప్పుడు అయితే రాజమౌళి విషయంలో ఏపీ ప్రభుత్వం వారు అసహనంగా ఉన్నారని ఒక టాక్ అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తుంది. ఈ సినిమా ఏపీలో షూటింగ్ చెయ్యకపోయినా ధరలు పెంచామని ఏపీ ప్రభుత్వం చెప్పగా కనీసం ఏపీలో ఒక్క సినిమా వేడుక కూడా మేకర్స్ అప్పుడు ప్లాన్ చెయ్యలేదు. (AP Government Disappointed With Rajamouli )
సరే ఇది పక్కన పెట్టినా ఇపుడు చిత్ర అంతా హైదరాబాద్, ముంబై సిటీ లలో సక్సెస్ వేడుకలు చేస్తున్నారు తప్ప ఏపీ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడ్డం లేదని అందుకే రాజమౌళి విషయంలో ఏపీ ప్రభుత్వం కాస్త గుర్రుగా ఉందని తెలుస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో కానీ పాయింట్ లో అయితే నిజం లేకపోలేదని ఒప్పుకొని తీరాలి.