RRR Pramotions: బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం
ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జనవరి 7వ తేదీ విడుదల కావాల్సి ఉండగా ఒమి క్రాన్
వేరియంట్ కారణంగా ఈ సినిమా మరోసారి విడుదల వాయిదా పడింది.అయితే జనవరి 7వ తేదీన ఈ సినిమా విడుదల చేయాలని భావించిన చిత్రబృందం గత నెల రోజుల నుంచి వివిధ నగరాలలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
అదేవిధంగా ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ఎంతో ఘనంగా చేశారు. ఇక మరొకవారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలలో ఆంక్షలు విధించడం అలాగే థియేటర్లలో కేవలం 50 శాతం సీట్ల భర్తీతో సినిమాలు విడుదల చేయాలని చెప్పడంతో ఈ సినిమా విడుదలను నిర్మాతలు వాయిదా వేసుకున్నారు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం చిత్రబృందం భారీ ఎత్తున ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
పలు నగరాలలో ప్రెస్ మీట్ పెట్టి ప్రమోషన్ చేయడం కోసం సుమారు పాతిక కోట్ల వరకు నిర్మాత ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఇక ముంబైలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం ఏకంగా పది కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వార్తలు వినిపించాయి.మొత్తానికి ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఈ సినిమా ప్రమోషన్ కోసం ఖర్చుచేసిన పాతిక కోట్లు వృధా అయ్యాయని పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.