ప్రభాస్ A – ఆదిపురుష్ లో ఐశ్వర్యరాయ్‌ ..ఆరోజె అనౌన్స్‌మెంట్ ..?

ఓం రౌత్.. బాలీవుడ్ జీనియస్.. హాలీవుడ్ స్థాయి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. తీసింది తక్కువ సినిమాలే అయినప్పటికి దేశం మొత్తం ఓం రౌత్ కి విపరీతమైన పాపులారిటి ఉంది. ముఖ్యంగా మరాఠిలో ‘లోకమాన్య : ఏక్ యుగ పురుష్’ సినిమాని తెరకెక్కించి ఫిలింఫేర్ అవార్డుని దక్కించుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో ‘తానాజీ’ సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించాడు. అయితే ఈ దర్శకుడి కన్ను టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ మీద పడుతుందని మాత్రం ఏ ఒక్కరు ఊహించలేదు.

ప్రస్తుతం ప్రభాస్, సైఫ్ అలీఖాన్ లతో ‘ఆది పురుష్’ అనే భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించడానికి సిద్దమవుతున్నాడు ఓం రౌత్. ప్రభాస్ రాముడిగా, సైఫ్ లంకేష్ గా కనిపించబోతుండగా అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి 750 కోట్ల కి పైగానే బడ్జెట్ ని కేటాయించినట్టు తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో నటించే సీత పాత్రలో ఏ స్టార్ హీరోయిన్ కనిపంచబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో సీత గా నటించబోతున్న హీరోయిన్ ని ప్రభాస్ బర్త్ డే అయిన ఈ నెల 23 రివీల్ చేయనున్నారని సమాచారం. అయితే రీసెంట్ గా ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు శివుడిగా అజయ్ దేవగన్ పాత్ర ఉంటుందని ప్రచారం అవుతోంది. కాగా ఇంతలోనే మరో హాట్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది.

ఆదిపురుష్ లో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ నటించబోతుందని సమాచారం. ఐశ్వర్యరాయ్‌ గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాత్ర అయితేనే ఒప్పుకుంటుంది. ఈ క్రమలోనే భారీ స్థాయీలో హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా ఆదిపురుష్ ని రూపొందించబోతున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఐశ్వర్యరాయ్‌ ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ ప్రభాస్ బర్త్ డే అయిన 23 న వచ్చే అవకాశాలున్నాయని ఆ రోజే ఐశ్వర్యరాయ్‌ కి సంబంధించిన అఫీషియల్ న్యూస్ రానిందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.