Jackie Shroff : ఇప్పుడు వివాదాలతో సావాసం చేయడమే అతి పెద్ద పని, అదే వృత్తిగా మార్చుకున్న రామ్ గోపాల్ వర్మ అప్పట్లో తెరకెక్కించిన సెన్సేషనల్ మూవీ ‘రంగీలా’. యూత్‌ని తన లోకంలోకి తీసుకెళ్లిపోయిందీ సినిమా.
బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో విజయం సాధించింది.
ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్. అప్పటి నుంచీ జాకీష్రాఫ్ తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తూనే వున్నాడు. తొలి ప్రయత్నం భళా అనిపించినా, ఆ తర్వాత ఆయన నటించిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడం విశేషం.
ఆయన మంచి నటుడు. ఆయన్ని వాడుకోవడం మన తెలుగు మేకర్లకు సెట్ కాలేదా.? లేక ఆయనకు తెలుగులో లక్కు కలిసి రాలేదో తెలీదు కానీ, ఆయన నటించిన పవన్ కళ్యాణ్ (పంజా మూవీ) వంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఫెయిలయ్యాయ్.
గోపీచంద్ నటించిన ‘సాహసం’ సినిమాలో జాకీ ష్రాఫ్ నటించాడు. సినిమా బాగానే వుంటుంది. కానీ, ఫెయిల్యూర్ టాక్ దక్కించుకుంది. అంతకు ముందే, మంచు విష్ణుతో ‘అస్త్రం’ సినిమాలో జాకీష్రాఫ్ నటించాడు. విష్ణు కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఇదొకటి.
అలాంటిది ఈ సినిమానీ ఫెయిల్యూర్ లిస్టులోనే పడేశారు.
అలాగే ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ ‘సాహో’ సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇలా జాకీష్రాఫ్ తెలుగు ఫెయిల్యూర్స్ లిస్టు చాలా పెద్దదే. అందుకే టాలెంటెడ్ నటుడైనప్పటికీ ఎందుకో తెలుగులో ఈయన సక్సెస్ కాలేకపోయాడు.
జాకీష్రాఫ్ నటిస్తే ఆ సినిమా ఖచ్చితంగా పెయిలవుతుందంతే.. అనే నిర్ణయానికి టాలీవుడ్ మేకర్లు వచ్చేశారట.
దాంతో ఆయన కోసం ఎప్పటికప్పుడే కొత్త కొత్త క్యారెక్టర్లు పుడుతున్నా, ఆయన్ని తీసుకోవాలా.? వద్దా.? అనే డైలమాలో వున్నారట తెలుగు మేకర్లు.