Murder:అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్.. స్టార్ రైడర్ సందీప్ నంగల్ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. ఎన్నో సంవత్సరాలుగా కబడ్డీ ఆటలో రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ నంగల్ సోమవారం పంజాబ్, జలంధర్ లోని మాలియన్ గ్రామంలో కబడ్డీ ఆడుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతని మీద కాల్పులకు పాల్పడ్డారు. ఘటనలు సందీప్ నంగల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సందీప్ నంగల్ కి భారత్ లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. సందీప్ నంగల్ కు అమెరికా, కెనడా, యూకే వంటి దేశాలలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. క్రేజ్ ఉన్న కబడ్డీ ప్లేయర్ ఎలా హత్యకు గురవడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ వార్త తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఘటన గురించి జలంధర్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ లక్వీందర్ సింగ్ మాట్లాడుతూ సోమవారం జలంధర్ లోని మాలియన్ గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అని ఆయన తెలిపారు.
సందీప్ దంగల్ ఆట ఆడుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో సందీప్ నంగల్ తల , ఛాతి భాగంలో దాదాపు 20 రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కాల్పుల్లో సందీప్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించి సందీప్ హత్యకు గల కారణాల గురించి పోలీసులు విచారణ చేపట్టారు. కబడ్డీ సమాఖ్యలో ఇంటర్నల్ గొడవల కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.