చిరంజీవి నటించాల్సిన భాషా రీమేక్ ఎందుకు ఆగిపోయిందో మీకు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఒకవైపు స్ట్రెయిట్ సినిమాలలో మరోవైపు రీమేక్ సినిమలలో కూడా చిరంజీవి నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో భాషా సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రజనీకాంత్ కు జోడీగా నగ్మా ఈ సినిమాలో నటించగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

భాషా పాత్రలో రజనీకాంత్ చెప్పిన అద్భుతమైన డైలాగ్ లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రజనీకాంత్ కెరీర్ లో ఈ సినిమా మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో భాషా పాత్రలో నటించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. భాషా సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమా డైరెక్టర్ సురేష్ కృష్ణ చిరంజీవిని కలిసి ఈ సినిమా కథ వినిపించారు. చిరంజీవి కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించారు.

అల్లు అరవింద్ ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం భాషా నిర్మాతను సంప్రదించగా ఆయన ఎక్కువ మొత్తం చెప్పడంతో అల్లు అరవింద్ అంత మొత్తం ఇవ్వలేక డ్రాప్ అయ్యారు. ఆ తర్వాత భాషా సినిమా తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకవేళ చిరంజీవి ఈ సినిమాలో నటించి ఉంటే చిరంజీవి సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచేది.

భాషా తరహా పాత్రలు మెగాస్టార్ చిరంజీవికి బాగా సూట్ అవుతాయి. ప్రస్త్తం చిరంజీవి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మినహా మిగిలిన సినిమాలన్నీ రీమేక్ సినిమాలుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నరు. ఈ రీమేక్ సినిమాలతో చిరంజీవి కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.