లోకల్ కథతో ఎన్టీఆర్ ట్రెండ్

Interesting info on NTR, Buchibabu movie
Interesting info on NTR, Buchibabu movie
 
తెలుగు స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ కూడ ఒకరు.  ఆయనతో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు సిద్ధంగా ఉన్నారు.  వారిలో బుచ్చిబాబు సాన కూడ ఉన్నారు.  బుచ్చిబాబు తన మొదటి చిత్రం ‘ఉప్పెన’తో పెద్ద హిట్ అందుకున్నారు.  ఆయనతో సినిమాలు నిర్మించడానికి పలువురు నిర్మాతలు రెడీగా ఉన్నారు.  బుచ్చిబాబు ఏమో ఎన్టీఆర్ తో సినిమా ఓకే చేసుకునే ప్రాసెస్లో ఉన్నారు.  ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు బుచ్చిబాబు చేయబోయే కథ ఒక స్పోర్ట్స్ డ్రామా అని, అందులో తారక్ 60 ఏళ్ల వృద్ధుడి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. 
 
ఇదిలా ఉండగా బుచ్చిబాబు తమ సినిమా గురించి చిన్న హింట్ ఇచ్చారు.  నిన్న బుచ్చిబాబు ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన హింట్ ఇచ్చారు. లోకల్ కథను ప్రపంచస్థాయిలో చెప్పి ట్రెండ్ సృష్టిద్దాం. అందుకోసం ఎదురుచూస్తున్నాను సర్’ అన్నారు.  బుచ్చిబాబు మాటలను వింటే సినిమాలో ఏదో ప్రత్యేకత ఉందనే అనిపిస్తుంది.  లోకల్ కథ, ఇంటర్నేషనల్ ట్రెండ్ అంటున్నారు కాబట్టి ఏదైనా అండర్ డాగ్ స్టోరీ అయ్యుంటుందని కూడ అనిపిస్తోంది.  మరి సినిమాలో ఉన్న ఆ విశేషం ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.