సాధారణంగా హిట్ టాక్ వచ్చిన సినిమాలకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలు హిట్లు అయిన సందర్భాలు ఉంటాయి. అయితే ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ వచ్చినా ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. గత నెలలో విడుదలైన అంటే సుందరానికి సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చిందనే సంగతి తెలిసిందే.
ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా తగ్గాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. ప్యాడింగ్ ఉన్నా భారీస్థాయిలో ప్రమోషన్స్ చేసినా కొన్ని సందర్భాల్లో సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు అయితే ఉన్నాయి. చిరంజీవి సినీ కెరీర్ లో ఫ్యాన్స్ కు నచ్చిన సినిమాలలో ఆపద్భాంధవుడు ఒకటి.
కె.విశ్వనాథ్ ఈ సినిమాకు దర్శకునిగా వ్యవహరించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. పాజిటివ్ టాక్ తో రిలీజైన ఈ సినిమా చివరకు ఫ్లాప్ అయింది. బాలయ్య హీరోగా తెరకెక్కిన మిత్రుడు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. నాగ్ నటించిన ఎదురులేని మనిషి పాజిటివ్ టాక్ తో మొదలై ఫ్లాప్ గా నిలిచింది. వెంకటేష్ నటించిన వాసు సినిమా కూడా పాజిటివ్ టాక్ తో మొదలై ఫ్లాప్ గా నిలిచింది.
పవన్ నటించిన బంగారం, తీన్ మార్, మహేష్ బాబు నిజం, ఎన్టీఆర్ రామయ్యా వస్తావయ్యా, ప్రభాస్ పౌర్ణమి, అల్లు అర్జున్ హ్యాపీ, బన్నీ ఆర్య2, రవితేజ నా ఆటోగ్రాఫ్, గోపీచంద్ సాహసం, రామ్ జగడం, చైతన్య ఆటోనగర్ సూర్య సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుండటం టికెట్ రేట్లు పెరగడంతో సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలను మినహా సాధారణ సినిమాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు.