వినాయక్ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే సాంబ మూవీ ఫ్లాప్ అయిందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వివి వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో సాంబ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. ఆది కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భూమిక, జెనీలియా సాంబ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో వినాయక్ వదిన మరిది మధ్య బంధాన్ని అసభ్యంగా చూపించారు. కథ ప్రకారం ఆ సన్నివేశం బాగానే ఉన్నా చాలామంది ప్రేక్షకులు ఆ సన్నివేశాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ ఒక్క తప్పు సాంబ సినిమా ఫ్లాప్ కావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైంది

వినాయక్ సైతం పలు ఇంటర్వ్యూలలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఈ విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలోని మరికొన్ని సన్నివేశాలు సైతం జూనియర్ ఎన్టీఆర్ వినాయక్ రేంజ్ కు అనుగుణంగా అయితే లేవని కామెంట్లు వ్యక్తమయ్యాయి. నిర్మాతకు ఈ సినిమాకు బిజినెస్ బాగానే జరగడం వల్ల లాభాలు మిగిలినా వినాయక్ కెరీర్ కు మాత్రం ఈ సినిమా అస్సలు ఉపయోగపడలేదని చెప్పాలి.

ఆ తర్వాత వినాయక్ పలు సినిమాలతో విజయాలను అందుకున్నా ప్రస్తుతం వినాయక్ కెరీర్ ఆశాజనకంగా లేదనే సంగతి తెలిసిందే. వినాయక్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం వినాయక్ ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తూ ఆ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. వినాయక్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకుంటారో లేదో చూడాలి.