ఈతరం హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ మరే హీరోకు సాధ్యం కాని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తల్లి షాలిని గురించి అభిమానులలో చాలామందికి తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నా తారక్ కు ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణమైన వ్యక్తి ఎవరనే ప్రశ్నకు మాత్రం ఆయన తల్లి షాలిని పేరు సమాధానంగా వినిపిస్తుంది.
జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని గురించి తారక్ అభిమానులకు సైతం పెద్దగా తెలియదు. షాలిని నందమూరి హరికృష్ణ రెండో భార్య అనే సంగతి తెలిసిందే. నందమూరి హరికృష్ణ, షాలిని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. షాలిని మ్యూజిక్ టీచర్ అని సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంలోని పిల్లలకు ఈమె మ్యూజిక్ నేర్పేదని ఆ సమయంలో హరికృష్ణ షాలినిల మధ్య పరిచయం ఏర్పడిందని సమాచారం.
ఆ పరిచయం తర్వాత రోజుల్లో ప్రేమగా మారింది. హరికృష్ణకు అప్పటికే మొదటి పెళ్లి జరగగా షాలినిని కూడా హరికృష్ణ పెళ్లి చేసుకున్నారు. షాలిని హరికృష్ణలకు జూనియర్ ఎన్టీఆర్ జన్మించారు. సీనియర్ ఎన్టీఆర్ కొన్నేళ్ల తర్వాత తారక్ ను ఇంటికి పిలిచి నామకరణం చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను కొన్నేళ్ల పాటు నందమూరి కుటుంబం మాత్రం దూరం పెట్టింది.
హరికృష్ణ సపోర్ట్ తో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించారు. అయితే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత సినిమాలతో కూడా ఊహించని స్థాయిలో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తారక్ ను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.