సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే కొన్ని నియమనిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. తమ సినిమాలలో నటించే హీరోహీరోయిన్లు పూర్తి సమయం సినిమాలకే కేటాయించాలని భావించే దర్శకనిర్మాతలు ఇండస్ట్రీలో ఎక్కువగానే ఉన్నారు. అయితే సినిమాల వల్ల కొంతమంది హీరోయిన్లు పిల్లల్ని కనడానికి దూరంగా ఉన్నారు. అప్పట్లో తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు చాలామంది హీరోయిన్లు బాధపడుతున్నారు.
నటి రేవతి నాటకాల ద్వారా సినిమాల్లో అవకాశాలను సంపాదించుకున్నారు. నటించిన సినిమాలు ఆమెకు నటిగా మంచి పేరును తెచ్చిపెట్టడంతో పాటు క్రేజ్ పెరగడానికి కారణమయ్యాయి. రేవతి భర్త పేరు సురేష్ చంద్ర మీనన్ కాగా వీళ్లకు పిల్లలు లేదు. కెరీర్ పై రేవతి దృష్టి పెట్టడంతో వీళ్లు పిల్లలకు దూరంగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం రేవతి ఒక బిడ్డను దత్తత తీసుకొని ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తున్నారు.
స్టార్ హీరోయిన్ విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్ ను పెళ్లి చేసుకున్నారు. పిల్లలకు దూరంగా ఉన్న విజయశాంతి సొసైటీ కోసం ఆమె పిల్లలకు దూరంగా ఉన్నారని సమాచారం. నటి శారద కూడా పిల్లల్ని కనడనికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె ఒంటరి జీవితం గడుపుతున్నారు. ప్రముఖ నటి జయప్రద కూడా పిల్లల్ని కనటానికి దూరంగా ఉన్న సెలబ్రిటీలలో ఒకరు కావడం గమనార్హం.
ఈ హీరోయిన్లలో మెజారిటీ హీరోయిన్లు తెలుగు వాళ్లు కావడం గమనార్హం. ఈ తరం సెలబ్రిటీలలో కూడా చాలామంది సెలబ్రిటీలు పిల్లలకు దూరంగా ఉన్నారు. ఈ హీరోయిన్లు రాబోయే రోజుల్లో పిల్లల్ని కనటానికి ఆసక్తి చూపుతారో లేదో చూడాలి. కెరీర్ పై దృష్టి పెట్టడం, పిల్లల్ని కంటే అందం పాడవుతుందనే భావన ఉండటం వల్లే చాలామంది హీరోయిన్లు పిల్లల్ని కనటానికి దూరంగా ఉన్నారని బోగట్టా.