గజిని సినిమాను మిస్ చేసుకున్న 12 మంది స్టార్స్ రిజెక్ట్ చేశారా.. ఎవరెవరంటే?

టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమాలలో గజిని సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో హ్యాండ్సమ్ గా కనిపించే సూర్య మిగిలిన సన్నివేశాల్లో మాత్రం గుండుతో కనిపించారు. అయితే గజిని సినిమాకు దర్శకుడు మురుగదాస్ ఫస్ట్ చాయిస్ సూర్య కాకపోవడం గమనార్హం. గజిని సినిమా అంచనాలకు మించి సక్సెస్ సాధించడం వల్ల సూర్యకు స్టార్ హీరోగా, మురుగదాస్ కు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కింది.

సూర్య, అసిన్ ఈ సినిమాలోని పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి ప్రశంసలు అందుకున్నారనే సంగతి తెలిసిందే. 2005 సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన విడుదలైన ఈ సినిమా 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాలో సూర్య హెయిల్ స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. హాలీవుడ్ మూవీ మొమెంటో ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ ను మురుగదాస్ సిద్ధం చేశారు.

మహేష్ బాబును ఈ కథలో నటింపజేయాలని మురుగదాస్ ప్రయత్నించగా రిస్కీ స్టోరీ అని మహేష్ ఈ సినిమాకు నో చెప్పారు. హీరో గుండు చేయించుకోవాల్సి ఉండటంతో స్టార్ హీరో వెంకటేష్ సైతం ఈ కథకు నో చెప్పారు. ఆ తర్వాత మాధవన్, పవన్ కళ్యాణ్ తో చేయాలని ప్రయత్నాలు చేసినా వాళ్ల నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, కమల్ హాసన్ సైతం ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపలేదు.

అజిత్ గజిని సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అజిత్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. సూర్య కథ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మురుగదాస్ తన టాలెంట్ తో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 92 వర్కింగ్ డేస్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. 10 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది.