సూపర్ స్టార్ కావాల్సిన సుధాకర్ కమెడియన్ గా మిగిలిపోవడానికి కారణాలివే?

తెలుగులోని పాపులర్ కమెడియన్లలో ఒకరైన సుధాకర్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. 2003, 2004 వరకు సుధాకర్ కామెడీతో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత రోజుల్లో ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలకు దూరమయ్యారు. అయితే కెరీర్ తొలినాళ్లలో ఆయన స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు. ఈ విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.

కొన్ని సినిమాలలో సుధాకర్ విలన్ రోల్స్ లో కూడా నటించారు. కొంతమంది తొక్కేయడం వల్లే సుధాకర్ అనుకున్న స్థాయిలో కెరీర్ విషయంలో ఎదగలేదని చాలామంది భావిస్తారు. తమిళ సినీ పరిశ్రమలో పాలిటిక్స్ వల్ల ఆయన కోలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం సుధాకర్ అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్నారు. యాక్టింగ్ స్కూల్ లో ఉన్న సమయంలోనే సుధాకర్ కు ఆఫర్లు వచ్చాయి.

తమిళంలో వరుస విజయాలు సాధించడంతో దర్శకనిర్మాతల్లో సుధాకర్ కు క్రేజ్ పెరిగింది. మూడేళ్లలో సుధాకర్ ఏకంగా 45 సినిమాలలో నటించారంటే ఆయనకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో సులభంగా అర్థమవుతుంది. అయితే కోలీవుడ్ అగ్రహీరోలు సుధాకర్ వల్ల తమకు ఛాన్స్ లు తగ్గడంతో సుధాకర్ కు అవకాశాలు తగ్గేలా చేశారు. సుధాకర్, రాధిక కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు తెరకెక్కాయి.

సుధాకర్ కూడా పలు ఇంటర్వ్యూలలో తనకు కావాలని ఛాన్స్ లు ఇవ్వలేదని ఆయన తెలిపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ప్రేక్షకుల హృదయాల్లో సుధాకర్ చోటు సంపాదించుకున్నారు. సుధాకర్ తన నటన ద్వారా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. సుధాకర్ పలు సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా సక్సెస్ సాధించారు. సుధాకర్ వరుస సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.