తండ్రి ఆఖరి కోరికను తీర్చిన స్టార్ హీరో ప్రభాస్.. అసలేం జరిగిందంటే?

స్టార్ హీరో ప్రభాస్ కు ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు ఉంది. ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ పాన్ వరల్డ్ హీరోగా ఎదుగుతారని చాలామంది భావిస్తున్నారు. ఈశ్వర్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ప్రభాస్ కు వర్షం సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. ప్రభాస్ తండ్రి కృష్ణంరాజు పేరు సూర్యనారాయణరాజు కాగా సూర్యనారాయణరాజు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజును కలిసి తన కొడుకుకు మంచి బ్లాక్ బస్టర్ హిట్ దక్కేలా చూడాలని కోరారు.

సూర్యనారాయణరాజు కోరడంతో ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎం.ఎస్.రాజు కూడా అంగీకరించారు. ప్రభాస్ తండ్రి నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకోవాలని ఎం.ఎస్.రాజు అనుకున్నారు. ఒక్కడు బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎం.ఎస్.రాజు ప్రభాస్ తో యాక్షన్ సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. పరుచూరి బ్రదర్స్ దగ్గర పని చేసిన వీరూపోట్ల ఒక యాక్షన్ సన్నివేశాన్ని చెప్పగా ఆ సన్నివేశం ఎం.ఎస్.రాజుకు చాలా నచ్చింది.

వీరూపోట్ల రామాయణం తరహా కథ చెప్పగా ఆ కథ ఎం.ఎస్.రాజుకు ఎంతగానో నచ్చింది. చరిత్రకు ప్రాధాన్యత ఉన్న కథతో ఈ సినిమాను తెరకెక్కించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. బాబీతో సినిమాతో ఫెయిల్యూర్ చవిచూసిన శోభన్ కు వర్షం సినిమాకు పని చేసే అవకాశం దక్కింది. త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయింది. హీరోయిన్ ఫాదర్ రోల్ కు ప్రకాష్ రాజ్ ను ఫైనల్ చేశారనే సంగతి తెలిసిందే.

దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ సినిమాకు పాటల రచయితగా ఎంపికయ్యారు. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ జోక్యంతో ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సినిమాలోని క్వారీ సన్నివేశాలలో డూప్ పెట్టాలని భావిస్తే ప్రభాస్ అందుకు ఏ మాత్రం అంగీకరించలేదు. 140 వర్కింగ్ డేస్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తైంది.

5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ప్రభాస్ కెరీర్ లో మైలురాయిగా ఈ సినిమా నిలిచింది. స్టార్ హీరోల సినిమాలకు పోటీగా విడుదలై వర్షం కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికీ టీవీలలో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్న సినిమాలలో వర్షం సినిమా కూడా ఒకటి. నిర్మాతగా ఎం.ఎస్.రాజుకు ఈ సినిమా భారీ స్థాయిలో లాభాలను అందించింది.