టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుల హీరో ఎవరనే ప్రశ్నకు స్టార్ హీరో బాలకృష్ణ పేరు సమాధానంగా వినిపిస్తోంది. బాలయ్య ఇప్పటివరకు 106కు పైగా సినిమాలలో నటించడం గమనార్హం. ఈ సినిమాలలో ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఉండగా ఎక్కువ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాలయ్య తన సినీ కెరీర్ లో వైవిధ్యం ఉన్న ఎన్నో పాత్రలలో నటించి ఆ పాత్రల ద్వారా ప్రశంసలను అందుకున్నారు.
బాలయ్య తన సినీ కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాయి. అయితే హిట్టయ్యే సత్తా ఉన్నా ఫ్లాపైన సినిమాలు బాలయ్య కెరీర్ లో ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాలు బాలయ్య అభిమానులకు నచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. బాలయ్య తప్పేం లేకపోయినా ఈ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. బాలకృష్ణ కెరీర్ తొలినాళ్లలో నటించిన సినిమాలలో జననీ జన్మభూమి ఒకటి కాగా ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదు.
కె విశ్వనాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందలేదు. బాలయ్య నటించిన సినిమాలలో ఒకటైన అశోక చక్రవర్తి సినిమా కూడా కథ, కథనం అద్భుతంగా ఉన్నా కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. బాలయ్య నటించిన ధర్మక్షేత్రం సినిమా కూడా వేర్వేరు కారణాల వల్ల విజయాన్ని అందుకోలేదు. బాలయ్య కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో నిప్పురవ్వ ఒకటనే సంగతి తెలిసిందే.
ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనం ఉన్నా ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. టాప్ హీరో, పవిత్ర ప్రేమ, సుల్తాన్, చెన్నకేశవరెడ్డి సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలు సక్సెస్ కాలేదు. ఈ సినిమాలు కమర్షియల్ గా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సినిమాలలో కొన్ని సినిమాలు బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రం తెగ నచ్చాయి.