చిరంజీవి, ఎన్టీఆర్ రికార్డులను బ్రేక్ చేసిన శ్రీకాంత్ మూవీ ఏదో మీకు తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడూ కొన్ని విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రేక్షకులకు సినిమా నచ్చితే చిన్న సినిమా అయినా సంచలన రికార్డులను క్రియేట్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సినిమాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. శ్రీకాంత్ నటించిన పెళ్లిసందడి సినిమా ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మౌత్ టాక్ వల్లే పెళ్లి సందడి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. రాఘవేంద్రరావు తక్కువ బడ్జెట్ తో సినిమా చేయాలని భావించి పెళ్లిసందడి సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. రాఘవేంద్రరావు నుంచి ఆఫర్ రావడంతో శ్రీకాంత్ సైతం షాకయ్యారు. పేరుకు చిన్న సినిమా అయినా ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పని చేశారు. 80 రోజుల పాటు ఈ సినిమా షూట్ జరిగింది.

ఈ సినిమాను సొంతంగా నిర్మాతలు 60 థియేటర్లలో విడుదల చేయగా సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కీరవాణి పాటలు ఈ సినిమాకు ప్రాణం పోశాయి. ఈ సినిమాలో డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ తో శ్రీకాంత్ కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. తమిళంలో విజయ్ హీరోగా ఈ సినిమా రీమేక్ కావడం గమనార్హం.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. సీనియర్ ఎన్టీఆర్ లవకుశ, చిరంజీవి నటించిన పలు సినిమాలు సెంటర్ల విషయంలో క్రియేట్ చేసిన రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది. ఇప్పుడు చూసినా బోర్ కొట్టని సినిమాలలో పెళ్లిసందడి ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత ఈ స్థాయిలో సంచలన విజయం సాధించిన సినిమాగా నువ్వే కావాలి సినిమా నిలిచింది.