రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూ.20 కోట్ల కలెక్షన్లు సాధించిన రవితేజ మూవీ ఇదే!

ఈ మధ్య కాలంలో వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు సైతం నిర్మాతలకు కోటి రూపాయల నుంచి రూ.2 కోట్ల రేంజ్ లో లాభాలు రావడం లేదు. అయితే దాదాపుగా 20 సంవత్సరాల క్రితమే రవితేజ నటించిన ఇడియట్ సినిమా పెట్టుబడితో పోల్చి చూస్తే పది రెట్లు ఎక్కువగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. పూరీ జగన్నాథ్ పవన్ కళ్యాణ్ మహేష్ లకు ఈ సినిమా కథ చెప్పగా ఈ హీరోలిద్దరూ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ఆ తర్వాత ఈ సినిమా కథ రవితేజ వద్దకు చేరగా రవితేజ ఈ సినిమాలో నటించడానికి వెంటనే అంగీకరించారు. బాచి సినిమా ఫ్లాప్ కావడంతో ఆ సినిమా ఫ్లాప్ పూరీ జగన్నాథ్ కెరీర్ పై కొంతమేర ఎఫెక్ట్ చూపించింది. తెలుగులో బాచి ఫ్లాప్ అయినా తెలుగు సినిమాలను ఎక్కువగా చూసే కర్ణాటకలో ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకుంది. అయితే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, యువరాజా సినిమాలతో పూరీ జగన్నాథ్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు.

పూరీ జగన్నాథ్ వైష్ణో అకాడమీ పేరుతో బ్యానర్ ను మొదలుపెట్టి ఇడియట్ సినిమాను తెరకెక్కించారు. నెగిటివ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చక్రి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమాతోనే పూరీ జగన్నాథ్ కు బ్యాంకాక్ తో అనుబంధం ఏర్పడింది. హీరో పాత్ర యూత్ కు తెగ నచ్చేసింది.

రవితేజ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. 45 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. యూత్ కు ఈ సినిమా ఎంతగానో నచ్చింది. ఇతర భాషల్లో రీమేక్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ తర్వాత రవితేజ కెరీర్ విషయంలో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రవితేజ ప్రస్తుతం స్టార్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇడియట్ సినిమా ఫుల్ రన్ లో రూ.20 కోట్ల కలెక్షన్లను సాధించింది.