సినిమాల ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ టాలీవుడ్ నటులలో రాజేంద్ర ప్రసాద్ ఒకరనే సంగతి తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే సినిమాల్లోకి రాకముందు రాజేంద్ర ప్రసాద్ అనుభవించిన కష్టాలు అన్నీఇన్నీ కావు. కామెడీ సినిమాలతో నటుడిగా రాజేంద్ర ప్రసాద్ అంతకంతకూ ఎదిగారు.
నవరసాలను అద్భుతంగా పలికించే టాలీవుడ్ ప్రముఖ హీరోలలో రాజేంద్ర ప్రసాద్ ఒకరు కావడం గమనార్హం. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రాజేంద్ర ప్రసాద్ కు సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. సీనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన రాజేంద్ర ప్రసాద్ మిమిక్రీ చేయడం ద్వారా కెరీర్ ను మొదలుపెట్టారు. సీనియర్ ఎన్టీఆర్ ఊరికి చెందిన వ్యక్తి అయిన రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో చనిపోవాలని అనుకున్నారు.
ఆ సమయంలో ఒక సినిమాలో ఛాన్స్ రాగా ఆ ఛాన్స్ తో రాజేంద్ర ప్రసాద్ కెరీర్ మలుపు తిరిగింది. మేలుకొలుపు సినిమాకు డబ్బింగ్ చెప్పడం ద్వారా రాజేంద్ర ప్రసాద్ నట ప్రస్థానం మొదలైంది. స్నేహం సినిమాలో చిన్న రోల్ ఆయన కెరీర్ కు మరింత ప్లస్ అయింది. కెరీర్ తొలినాళ్లలో వైవిధ్యమైన పాత్రలలో నటించడం ద్వారా రాజేంద్ర ప్రసాద్ విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా రాజేంద్ర ప్రసాద్ కెరీర్ మొదలైంది.
లేడీస్ టైలర్ సినిమా సక్సెస్ తో రాజేంద్ర ప్రసాద్ కెరీర్ మలుపు తిరిగింది. ఏప్రిల్1 విడుదల, అహ నా పెళ్లంట, అప్పుల అప్పారావు మరికొన్ని సినిమాలు ఆయన కెరీర్ ను మలుపు తిప్పాయి. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాజేంద్ర ప్రసాద్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. త్రివిక్రమ్, అనిల్ రావిపూడి సినిమాలలో రాజేంద్ర ప్రసాద్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. రాజేంద్ర ప్రసాద్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.