పదిమంది రిజెక్ట్ చేసిన కథతో హిట్టు కొట్టిన రాజేంద్ర ప్రసాద్.. ఏ మూవీ అంటే?

రాజేంద్ర ప్రసాద్ సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. ఎన్నో విభిన్నమైన కథలలో నటించి రాజేంద్ర ప్రసాద్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ నటించి సక్సెస్ సాధించిన సినిమాలలో ఆ నలుగురు సినిమా కూడా ఒకటి. మదన్ అంతిమ యాత్ర పేరుతో ఈటీవీ ఛానల్ లో కథ చెబుతుండగా చావు కథతో 26 ఎపిసోడ్ల సీరియల్ తీయడం సాధ్యం కాదని అవతలి వైపు వ్యక్తి వెల్లడించారు.

ఆ తర్వాత మదన్ ఈ సినిమాలో హీరోగా ఎంతోమంది పేర్లను పరిశీలించారు. దాసరి నారాయణరావు, విసు, మోహన్ బాబు, మరి కొందరి పేర్లు మొదట ఈ సినిమా కోసం వినిపించాయి. ప్రకాష్ రాజ్ ఈ సినిమా కథ విని సినిమాగా కంటే నవలగా ఈ కథ బాగుంటుందని సూచించారు. చంద్ర సిద్దార్థ్ మదన్ దగ్గర ఉన్న కథను తీసుకొని హీరో కోసం పరిశీలించారు. మదన్ కథ చెప్పిన వెంటనే రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు ఓకే చెప్పారు.

ఈ సినిమాకు అనుగుణంగా రాజేంద్ర ప్రసాద్ తన లుక్ ను మార్చుకున్నారు. కథ విని ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకు ఓకే చెప్పారు. కోటీ 25 లక్షల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో చంద్ర సిద్దార్థ్ నాన్న చనిపోయారు. ఆ నలుగురు సినిమా విడుదలైన తర్వాత రెండు వారాల పాటు సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు రాలేదు. 10 మంది రిజెక్ట్ చేసిన కథ ఆ తర్వాత హౌస్ కావడంతో పాటు భారీస్థాయిలో కలెక్షన్లను సాధించారు.

ఆ నలుగురు బుల్లితెరపై కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ బుల్లితెరపై మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమాలలో ఆ నలుగురు ఒకటి కావడం గమనార్హం. రాజేంద్ర ప్రసాద్ తర్వాత రోజుల్లో కూడా ఈ తరహా కథాంశంతో తెరకెక్కిన సినిమాలలో నటించారు. అయితే ఆ నలుగురు సినిమా సక్సెస్ సాధించినా ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ నటించిన పలు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు సక్సెస్ కాలేదు.