రూ.3 కోట్లు ఇస్తామన్నా ఆ సినిమాలో నటించని నారాయణమూర్తి.. షాక్ అయ్యేలా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న సెలబ్రిటీలలో చాలామంది డబ్బుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంతమంది స్టార్ హీరోయిన్లు సైతం ఎక్కువ మొత్తం డబ్బును ఆఫర్ చేస్తే స్పెషల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ చేయడానికి సిద్ధపడుతున్నారు. హీరోలు సైతం కథ, పాత్రల కంటే రెమ్యునరేషన్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయనే చెప్పాలి.

అయితే ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన ఆర్.నారాయణ మూర్తి మాత్రం డబ్బు కంటే విలువలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన టెంపర్ సినిమాలో కీలక పాత్రలో నటించే ఆర్ నారాయణమూర్తికి దక్కింది. ఆ పాత్రలో నటించడానికి నిర్మాతలు బ్లాంక్ బెక్ ఇచ్చారని సమాచారం. ఏకంగా 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా నారాయణమూర్తి ఈ సినిమాకు నో చెప్పారని తెలుస్తోంది.

నారాయణమూర్తి ఆ పాత్రను రిజెక్ట్ చేసిన తర్వాత ఆ పాత్రలో పోసాని కృష్ణమురళి నటించారు. ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి పాత్ర పేరు నారాయణమూర్తి అనే సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచే సామాజిక స్పృహ ఉన్న నారాయణమూర్తికి అదే సమయంలో సినిమాలపై ఆసక్తి ఉండేది. నేరము శిక్ష అనే సినిమాలో చిన్న పాత్రతో నారాయణ మూర్తి కెరీర్ మొదలైంది.

బీఏ చదివే సమయంలో కమ్యూనిస్ట్ గా మారిన నారాయణ మూర్తి సినిమా ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొనిరావాలని నారాయణమూర్తి భావించారు. నీడ సినిమాలో నారాయణమూర్తి నక్సలైట్ పాత్రలో నటించి మెప్పించారు. నారాయణమూర్తి సినిమాలు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సక్సెస్ సాధించాయి. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండాలనే ఆలోచన ఉన్న నారాయణమూర్తి టెంపర్ సినిమాలో నటించలేదు. డబ్బు కంటే విలువలకే ప్రాధాన్యత ఇచ్చిన వారిలో నారాయణమూర్తి ఒకరు.