వాళ్లిద్దరినీ కొడుకుల కంటే ప్రేమగా చూసుకున్న పవన్.. ఏం జరిగిందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతో ప్రేమగా చూసుకుంటారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే సినిమాలో నటిస్తుండగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతోంది. అయితే ఈ సినిమాతో పవన్ కచ్చితంగా సక్సెస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

అయితే మేనల్లుళ్లు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కోసం పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో త్యాగాలు చేశారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పవన్ రేంజ్ కు ఈ రెమ్యునరేషన్ తక్కువే అయినా పవన్ తన క్రేజ్ కు అనుగుణంగా ఈ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారని సమాచారం అందుతోంది.

పవన్ కళ్యాణ్ నటించాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు సంబంధించి షాకింగ్ రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కానుందని హరీష్ శంకర్ కు మరికొన్ని సంవత్సరాల పాటు ఎదురుచూపులు తప్పవని ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తలు పవన్ సినీ కెరీర్ పై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఈ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ వినోదాయ సిత్తం మూవీ రీమేక్ లో నటిస్తున్నారు.

సముద్రఖని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో మొదలుకానుంది. ఈ సినిమాలో పవన్ గెస్ట్ రోల్ లో నటిస్తుండగా సాయితేజ్ ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తున్నారు. పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.