పదివేలకు పవన్ మూవీ కథను అమ్ముకోవాలనుకున్న పూరీ.. ఏమైందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. పవన్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో బద్రి సినిమా ఒకటి. అయితే కేవలం పదివేల రూపాయలకు బద్రి మూవీ కథను అమ్ముకోవాలని పూరీ జగన్నాథ్ అనుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ విధంగా నిజంగా జరగడం గమనార్హం.

పూరీ జగన్నాథ్ మొదట సుమన్ తో పాండు పేరుతో ఒక సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ మొదలుకాకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత కృష్ణతో థిల్లానా అనే సినిమాను తెరకెక్కించాలని పూరీ జగన్నాథ్ అనుకున్నారు. ఒకరోజు షూటింగ్ తర్వాత ఈ సినిమా కూడా ఆగిపోవడం గమనార్హం. ఆ తర్వాత పవన్ తో సినిమా చేయాలని పూరీ జగన్నాథ్ భావించారు.

బద్రి కథను మొదట నాగ్ కు చెప్పగా నాగ్ ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత మరో వ్యక్తి పేరుతో 10,000 రూపాయలకు బద్రి కథను నవలగా ప్రచురించడానికి పూరీ జగన్నాథ్ కు ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ నఛ్కినా పూరీ వదులుకున్నారు. ఆ తర్వాత ఛోటా కె నాయుడు సహాయంతో పవన్ ను పూరీ జగన్నాథ్ కలిశారు. పూరీ జగన్నాథ్ కథ నచ్చి బద్రి సినిమాకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. పవన్ క్లైమాక్స్ మార్చాలని కోరగా పూరీ జగన్నాథ్ మాత్రం మార్చలేదు.

పవన్ కథపై నీకున్న నమ్మకాన్ని టెస్ట్ చేయడం కోసమే క్లైమాక్స్ మార్చాలని చెప్పానని పూరీతో చెప్పి బద్రిలో నటించారు. బద్రి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు 50,000 రూపాయలు పూరీ జగన్నాథ్ అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ డబుల్ హ్యాట్రిక్ సాధించారు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే సినిమా డిజాస్టర్ గా నిలిచింది.