Nenu Local: నేను లోకల్ సినిమాను మిస్సైన మెగా హీరో.. ఎవరంటే?

Nenu Local: త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో కీర్తి సురేష్, నాని జంటగా నటించిన చిత్రం నేను లోకల్. ఈ సినిమాకు దిల్ రాజు, బెక్కం వేణుగోపాల్ నిర్మాతలుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టింది. అంతే కాకుండా ఈ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో కామెడీ తో పాటు, ఎమోషనల్ సన్నివేశాలు, మాస్ సన్నివేశాలు అన్ని ఉండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి ఊహించని స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.. ఒక సినిమాను చేస్తే ప్రమోషన్ చేసె సత్తా,బిజినెస్ చేసే సామర్థ్యం ఉండాలి అనే వేణుగోపాల్ తెలిపారు. డబ్బు ఒకటే ఉంటే సినిమా రంగంలో సక్సెస్ కావచ్చు అని భావించడం కరెక్ట్ కాదని ఆయన సూచించారు. సినిమాలలో ఆ పాత్రల్లో ఎవరు బాగా ఆ పాత్రకు సూట్ అవుతారో వాళ్లను మాత్రమే ఆ పాత్రకు ఎంపిక చేస్తారు అని బెక్కం వేణుగోపాల్ చెప్పుకొచ్చారు. సినిమా కథను ఎందుకు వెళ్తాను అని తెలిపారు.

ఇక పోతే నేను లోకల్ సినిమా నేను మొదట హీరో సాయి ధరమ్ తేజ్ తో అనుకున్నామని, కొన్ని కారణాల వల్ల ఆ ప్లాన్ వర్క్ అవుట్ అవ్వలేదని, ఆ తర్వాత ఆ సినిమా కథ నానికి చెప్పి ఒప్పించడం అని జరిగిపోయాయి అని చెప్పుకొచ్చారు. అదేవిధంగా రాజ్ తరుణ్, అవికా గోర్ నటించిన సినిమా చూపిస్త మామ సినిమా కూడా మొదట హీరోహీరోయిన్లుగా వాళ్ళని అనుకోలేదని, సినిమా ఓపెనింగ్ అయిన తర్వాత వాళ్ళిద్దరి ఎంపిక జరిగింది అని చెప్పుకొచ్చారు వేణుగోపాల్. ఇండస్ట్రీలో ఎన్నో చిన్న చిన్న సినిమాలకు సలహాలు ఇచ్చి తన వంతు సహాయం చేశాను అని వెల్లడించారు.