తారకరత్న ఇంటినుంచి బయటకు వచ్చేయడానికి కారణమేంటో మీకు తెలుసా?

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా నందమూరి హీరో కావడంతో పాటు హీరో పాత్రలతో పోల్చి చూస్తే విలన్ పాత్రలు మంచి పేరును తెచ్చిపెట్టడంతో నందమూరి తారకరత్నకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. సీనియర్ ఎన్టీఆర్ మనవడు అయిన తారకరత్నకు ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో నటుడిగా మంచి పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత తారకరత్న నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు.

హీరోకు కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ అదృష్టం లేకపోవడం వల్ల తారకరత్న సినిమా రంగంలో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంలో విఫలమయ్యారు. అయితే నందమూరి తారకరత్న వ్యక్తిగత జీవితం గురించి మాత్రం ఎక్కువమందికి తెలియదు. కథల ఎంపికలో లోపాల వల్లే తారకరత్న అనుకున్న స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయారని చాలామంది భావిస్తారు.

ఒకే సమయంలో ఎనిమిది సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారకరత్న స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకోవడంలో విఫలమయ్యారు. తారకరత్న ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఇంటినుంచి బయటకు వచ్చారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో మరోవైపు వెబ్ సిరీస్ లతో తారకరత్న బిజీగా ఉన్నారు. సరైన ఛాన్స్ వస్తే ఇతర హీరోల సినిమాలలో కూడా నటించడానికి తారకరత్న సిద్ధంగా ఉన్నారు.

తాజాగా తారకరత్న నటించిన 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ ఓటీటీలో విడుదలైంది. నందమూరి హీరోల సినిమాలలో నటిస్తే తారకరత్న క్రేజ్ మరింత పెరుగుతుందని పెరుగుతుందని చెప్పవచ్చు. మరి తారకరత్న ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి. తారకరత్నకు కూడా భారీ స్థాయిలోనే అభిమానులు ఉన్నారని తెలుస్తోంది. తారకరత్న మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.