మీనా పడుకున్న మంచం వాడితే సినిమా హిట్.. ఈ షాకింగ్ సెంటిమెంట్ తెలుసా?

సాఫ్ట్ రోల్స్ లో నటించడం ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో మీనా ఒకరు. అలనాటి స్టార్ హీరోలలో దాదాపుగా అందరు హీరోలకు జోడీగా మీనా నటించడం గమనార్హం. చెన్నైలో పుట్టి పెరిగిన మీనా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోని సినిమాలలో నటించి విజయాలను సొంతం చేసుకున్నారు. మీనా తల్లి రాజమల్లిక కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న మహిళ కావడం గమనార్హం.

బాలనటిగా మీనా కెరీర్ ను మొదలుపెట్టగా ఆమె నటించిన పలు సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. పలు సినిమాలు నటిగా మీనా రేంజ్ ను పెంచడం గమనార్హం. వెంకటేష్, మీనా కాంబినేషన్ లో తెరకెక్కిన పలు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించి ఈ కాంబినేషన్ కు మంచి పేరును తెచ్చిపెట్టాయి. రజనీకాంత్ కు జోడీగా నటించడం వల్ల మీనా దేశవిదేశాల్లో పాపులర్ అయ్యారు.

దాదాపుగా 10 సంవత్సరాల పాటు తెలుగులో మీనా నంబర్ వన్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించారు. వెంకటేష్ కెరీర్ లో ఫ్లాపైన సినిమాల కంటే హిట్టైన సినిమాలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. వెంకటేష్ రీమేక్ సినిమాలలో ఎక్కువగా నటించడం గమనార్హం. వెంకటేష్ నటించిన చంటి సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమాలో వెంకటేష్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తమిళంలో హిట్టైన చిన్నతంబి సినిమాకు ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. వెంకటేష్ ఈ సినిమా రీమేక్ పై ఆసక్తి చూపారు. రవిరాజా పినిశెట్టి ఈ సినిమాకు చంటి అనే టైటిల్ ను సూచించారు. ఈ సినిమాలో మీనా పడుకున్న మంచంకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ మంచం ఏ సినిమాలో వాడినా ఆ సినిమా హిట్ అని జోరుగా ప్రచారం జరగడం గమనార్హం. పాజిటివ్ టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది. ఈ సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.