మరో చరిత్ర మూవీ చూసి 20 ప్రేమ జంటలు సూసైడ్.. ఏం జరిగిందంటే?

కమల్ హాసన్ సినీ కెరీర్ లో సంచలన విజయం సాధించిన సినిమాలలో మరో చరిత్ర సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. విషాదాంత ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కగా కమల్ హాసన్, సరిత హీరోహీరోయిన్లుగా నటించారు. ఊహించని కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న సినిమాలలో ఈ సినిమా ఒకటి కావడం గమనార్హం.

కె.బాలచందర్ తెరకెక్కించిన ఈ సినిమా ఎంతోమంది ప్రేమికులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిన సినిమాలలో ఒకటి కావడం గమనార్హం. ఈ సినిమా చూసి తమ లవ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో అని భయపడి 20 ప్రేమ జంటలు సూసైడ్ చేసుకున్నాయి. మాధవి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించడం గమనార్హం.

గణేష్ పాత్రో ఇచ్చిన సూచన ఆధారంగా ఈ సినిమాకు మరో చరిత్ర అనే టైటిల్ ఫిక్స్ అయింది. ఈ సినిమాలో హీరో పాత్ర పేరు బాలు కాగా హీరోయిన్ పాత్ర పేరు స్వప్న కావడం గమనార్హం. ఎంతోమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించి చివరకు ఈ సినిమాకు సరితను ఫైనల్ చేశారు. బాలచందర్ సరిత తెలివితేటలను పరిశీలించి ఆమెను ఫైనల్ చేశారు. అభిలాష పేరు సరితగా ఈ సినిమాతో మారింది.

విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఉదయం, సాయంత్రం సమయాలలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. ఈ సినిమా కోసం తమిళ టెక్నీషియన్లు పని చేశారు. ఈతరం ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఎంతగానో ఇష్టపడతారు. నెగిటివ్ క్లైమాక్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.