ఖుషి, నరసింహ నాయుడు సినిమాలలో ఏ సినిమా బిగ్గెస్ట్ హిట్టో మీకు తెలుసా?

2001 సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన సినిమాలలో ఖుషి, నరసింహ నాయుడు ముందువరసలో ఉంటాయి. అయితే ఈ రెండు సినిమాలలో ఏ సినిమా బిగ్గెస్ట్ హిట్ అనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు ఖుషి సినిమా బిగ్గెస్ట్ హిట్ అని చెబితే బాలకృష్ణ అభిమానులు మాత్రం నరసింహ నాయుడు బిగ్గెస్ట్ హిట్ అని చెబుతారు.

ఈ సినిమాల ఫలితాల విషయంలో అభిమానుల్లో సైతం ఒకింత కన్ఫ్యూజన్ నెలకొంది. నరసింహ నాయుడు సినిమా 2001 సంవత్సరం జనవరి 11వ తేదీన రిలీజ్ కాగా ఖుషి సినిమా 2001 సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీన విడుదలైంది. అటు ఖుషి ఇటు నరసింహ నాయుడు 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి. నైజాం, కృష్ణా జిల్లాలో నరసింహ నాయుడు కంటే ఖుషి సినిమా ఎక్కువ కలెక్షన్లను సాధించింది.

అయితే మిగిలిన ఏరియాలలో మాత్రం నరసింహ నాయుడు సినిమా పైచేయి సాధించింది. సెంటర్స్ విషయంలో బాలకృష్ణ నరసింహ నాయుడు సినిమానే ముందువరసలో ఉంది. ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేసినా 2001 బాక్సాఫీస్ లెక్కల ప్రకారం నరసింహ నాయుడు సినిమానే ఇండస్ట్రీ హిట్ కావడం గమనార్హం. నరసింహ నాయుడు ఆలస్యంగా విడుదలై ఉంటే మాత్రం ఖుషి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఉండేది.

ఖుషి ఇండస్ట్రీ హిట్ అని అప్పట్లో నిర్మాతలు సైతం ప్రచారం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ రేంజ్ ను సైతం పెంచాయి. సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.