అనిల్ రావిపూడికి జూనియర్ ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వకపోవడానికి అసలు కారణమిదే?

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమా ఏ స్థాయిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. వరుస ఫ్లాపులతో కళ్యాణ్ రామ్ కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో రిలీజైన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు నటుడిగా మంచి పేరు తెచ్చింది. టెంపర్, పటాస్ సినిమాలు దాదాపుగా ఒకే కథతో తెరకెక్కగా పటాస్ మొదట విడుదల కావడం ఆ సినిమాకు ప్లస్ అయింది.

పటాస్ సినిమాతో పాటు తర్వాత సినిమాలు కూడా సక్సెస్ సాధించడంతో అనిల్ రావిపూడి బాలయ్య సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి ఈ ప్రశ్నకు స్పందిస్తూ తాను తారక్ ను చాలా సందర్భాల్లో కలిశానని తారక్ నాకు పాయింట్ చెప్పాలని అడిగారని తెలిపారు. రాజా ది గ్రేట్ టైమ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు కథ చెప్పానని ఆయన తెలిపారు.

తాను చెప్పిన పాయింట్ తారక్ కు నచ్చిందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో మంచి కథతో తారక్ ను కలిస్తే ఆయన ఇవ్వొచ్చని అనిల్ రావిపూడి కామెంట్లు చేశారు. నాకు అందరు హీరోలతో పని చేయాలని ఉందని స్వార్థం ఎక్కువని ఆయన తెలిపారు. ఆదిత్య 369 లాంటి ఫిక్షన్ చేయాలని తన కోరిక అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. మైథలాజికల్ సినిమా చేయాలని తాను భావిస్తున్నానని ఆయన వెల్లడించారు.

నాకు ఆ స్థాయి వచ్చిన తర్వాత అలాంటి సినిమాను కచ్చితంగా చేస్తానని ఆయన తెలిపారు. బాలయ్యతో సినిమా తెరకెక్కించి సక్సెస్ సాధిస్తే అనిల్ రావిపూడికి ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అనిల్ రావిపూడి తర్వాత సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. అనిల్ రావిపూడి తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.