చిరంజీవి రిజెక్ట్ చేసిన కథలో హీరోగా నటించిన జూనియర్ ఎన్టీఆర్.. చివరకు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. చిన్న వయస్సులోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్న ఎన్టీఆర్ ఆ గుర్తింపు వల్ల కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి హిట్టయ్యాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలోని దాదాపుగా అందరు స్టార్ హీరోలతో జూనియర్ ఎన్టీఆర్ పని చేశారు.

నిన్ను చూడాలని ఫ్లాపైనా స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కోరుకున్న సక్సెస్ దక్కింది. ఆ తర్వాత ఆది, సింహాద్రి సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ను పెంచాయి. సింహాద్రి సినిమాతో ఊహించని స్థాయిలో మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తర్వాత సినిమా ఆంధ్రావాలా పేరుతో తెరకెక్కి రికార్డు స్థాయి థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించారు.

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ వల్ల సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ కు ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువమంది హాజరయ్యారు. అయితే ఆంధ్రావాలా కథ మొదట చిరంజీవి రిజెక్ట్ చేసిన కథ కావడం గమనార్హం.

చిరంజీవి రిజెక్ట్ చేశారని తెలిసినా కథ నచ్చడంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవితో సినిమా తీయాలని కలలు కంటున్న పూరీ జగన్నాథ్ ఆ కోరికను ఎప్పటికి నెరవేర్చుకుంటారో చూడాల్సి ఉంది. చిరంజీవి పూరీ జగన్నాథ్ కాంబోలో సినిమా రాకపోయినా రామ్ చరణ్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో చిరుత సినిమా తెరకెక్కగా ఆ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.