రాజశేఖర్ డాన్స్ గురించి చిరంజీవి అలా అనుకున్నారా.. అసలేమైందంటే?

కొన్ని కాంబినేషన్లలో సినిమాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయనే సంగతి తెలిసిందే. అలాంటి కాంబినేషన్లలో రాజశేఖర్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కిన అల్లరి ప్రియుడు సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం. రాజశేఖర్ మాస్ సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంటే రాఘవేంద్రరావు క్లాస్ సినిమాల ద్వారా గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకులు సైతం ఆశ్చర్యానికి గురవుతారు.

అల్లరి ప్రియుడు సినిమా షూట్ సమయంలో కొంతమంది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తే మరి కొందరు ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని భావించారు. ఈ సినిమా ద్వారా రాఘవేంద్ర రావు హీరో రాజశేఖర్ లోని లవర్ బాయ్ యాంగిల్ ను ప్రేక్షకులకు తెలిసేలా చేశారు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సాజన్ సినిమా స్పూర్తితో తెలుగులో అల్లరి ప్రియుడు సినిమా తెరకెక్కడం గమనార్హం.

ఈ సినిమాలో రమ్యకృష్ణ, మధుబాలతో కలిసి అదుర్స్ అనిపించేలా స్టెప్పులు వేసి రాజశేఖర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలో రాజశేఖర్ డ్యాన్స్ ను చూసిన మెగాస్టార్ చిరంజీవి రాజశేఖర్ ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేయగలరా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని సమాచారం. రాజశేఖర్ నట జీవితాన్ని మలుపు తిప్పిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం.

రాజశేఖర్ రాఘవేంద్రరావు దారిలోకి వెళ్లి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ కు చిరంజీవి గెస్ట్ గా హాజరై షీల్డ్ లను అందజేయడం గమనార్హం. ప్రభుదేవా ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ గా పని చేయగా రాజశేఖర్ కు పూర్తిస్థాయిలో స్వేచ్చ ఇచ్చి స్టెప్స్ వేయించారని బోగట్టా