ఒక్క టికెట్ 50,000 రూపాయలకు అమ్ముడైన చిరంజీవి మూవీ ఏదో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్టాలిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాల్సిన ఈ సినిమా దర్శకుడు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. స్టాలిన్ సినిమా అద్భుతమైన కథతో తెరకెక్కింది. మెగా అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

2006 సంవత్సరం సెప్టెంబర్ నెల 20వ తేదీన స్టాలిన్ సినిమా విడుదలైంది. ఠాగూర్ సినిమా సక్సెస్ వల్లే మురుగదాస్ కు చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు. మురుగదాస్ తమిళంలో తెరకెక్కించిన రమణ సినిమాకు ఠాగూర్ రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క స్పెషల్ సాంగ్ చేయగా ఆ సాంగ్ కూడా హిట్టైంది. 320 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.

ఆ సమయంలో యూఎస్ లో ఒక వ్యక్తి ఇండియన్ కరెన్సీ ప్రకారం 50,000 రూపాయలు ఖర్చు చేసి ఈ సినిమా టికెట్ ను కొనుగోలు చేయడం సెన్సేషన్ అయింది. సినిమా తొలి టికెట్ కావడంతో చిరంజీవి అభిమాని ఒకరు ఇంత మొత్తం ఖర్చు చేశారు. సినిమాలో కొన్ని సీన్స్ హైలెట్ గా ఉన్నాయి. భారీ అంచనాల వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిందని కామెంట్లు వినిపించాయి. చిరంజీవి త్రిష జోడీకి కూడా నెగిటివ్ మార్కులు పడ్డాయి.

ముగ్గురికి సాయం చేయడమనే అద్భుతమైన కాన్సెప్ట్ ఉన్నప్పటికీ సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేదు. ఈ సినిమా 34 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూస్తే ఈ సినిమాకు 4 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అయితే టాక్ నెగిటివ్ గా ఉన్నా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా టీవీలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.