మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కాగా సెప్టెంబర్ లో గాడ్ ఫాదర్, వచ్చే ఏడాది జనవరిలో వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ కానున్నాయి. భోళా శంకర్ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. బ్యాగ్రౌండ్ లేకుండా చిరంజీవి ఈ స్థాయికి ఎదిగారనే సంగతి తెలిసిందే.
తనపై ఎవరైనా విమర్శలు చేసినా చిరంజీవి ఆ విమర్శలను పెద్దగా పట్టించుకోరు. అయితే మెగాస్టార్ చిరంజీవికి కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయితే చిరంజీవి మాత్రం ఆ అవమానాలను పట్టించుకోకుండా కెరీర్ విషయంలో ముందడుగులు వేశారు. తనకు ఎదురైన అవమానాల గురించి ఇతరులతో చర్చించడానికి కూడా మెగాస్టార్ ఇష్టపడే వారు కాదని సమాచారం.
తనకు ఎదురైన అవమానాలను అస్సలు పట్టించుకోకుండా చిరంజీవి కెరీర్ ను కొనసాగించారు. చిరంజీవి, మాధవి కలిసి ఒక సినిమాలో నటించగా ఆ తర్వాత మాధవి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. వేర్వేరు హోటల్స్ నుంచి చిరంజీవి, మాధవిని తీసుకొని షూటింగ్ లొకేషన్ కు రావాలని నిర్మాత సూచించగా కారులో మాధవి పక్కన చిరంజీవి వెనుక సీటులో కూర్చుంటే ముందు సీటులో కూర్చోవాలని ఆమె చిరంజీవిని అవమానించించారు.
ఆ తర్వాత కూడా చిరంజీవి సినిమా షూట్ పూర్తయ్యేవరకు ముందు సీటులో కూర్చున్నారు. ఆ తర్వాత చిరంజీవి ఊహించని స్థాయికి ఎదిగితే మాధవికి మాత్రం అవకాశాలు తగ్గాయి. చిరంజీవి ప్రస్తుతం ఏడు పదుల వయస్సులో కూడా సక్సెస్ ఫుల్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. చిరంజీవి ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకోవాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.