టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలలో ఒకరైన నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆరు నెలలకు ఒక సినిమాను రిలీజ్ చేస్తూ ఇతర టాలీవుడ్ హీరోలకు చైతన్య గట్టి పోటీ ఇస్తున్నారు. నాగచైతన్య తల్లి పేరు దగ్గుబాటి లక్ష్మీ అనే సంగతి తెలిసిందే. దగ్గుబాటి లక్ష్మీ గురించి అభిమానులకు పెద్దగా తెలియదు. నాగచైతన్య కూడా సినిమా ప్రమోషన్స్ లో వ్యక్తిగత విషయాలను వెల్లడించడానికి ఇష్టపడతారే తప్ప ఇతర విషయాలను చెప్పడానికి ఇష్టపడరనే సంగతి తెలిసిందే.
నాగార్జున, లక్ష్మీ మధ్య మనస్పర్ధలు రావడం వల్లే వీళ్లిద్దరూ విడిపోయారని సమాచారం. నాగచైతన్య చిన్నప్పుడు తల్లి దగ్గరే పెరిగారనే సంగతి తెలిసిందే. వెంకటేష్ కు లక్ష్మీ సోదరి అనే సంగతి తెలిసిందే. దగ్గుబాటి లక్ష్మీ ఎమోషనల్ అని చాలా సెన్సిటివ్ అని సమాచారం. అయితే నాగార్జున లక్ష్మీ విడిపోవడానికి కారణం మాత్రం తెలియదు. దగ్గుబాటి లక్ష్మీకి తండ్రి నుంచి వారసత్వంగా కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయని తెలుస్తోంది.
లక్ష్మీ మొదట నాగచైతన్య సినిమాలలో నటించడానికి ఒప్పుకోలేదని తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. నాగార్జునతో విడిపోయిన తర్వాత లక్ష్మీ మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య సమంతను ప్రేమిస్తున్నానని చెప్పిన సమయంలో చాలా కాలం తర్వాత లక్ష్మీ వీళ్లిద్దరి వివాహానికి అంగీకరించిందని సమాచారం. చైసామ్ విడాకులు లక్ష్మీని చాలా బాధ పెట్టాయని సమాచారం.
చైతన్య కెరీర్ లో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె కోరుకుంటున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాకు కూడా లక్ష్మీ దూరంగా ఉంటున్నారు. మరోవైపు చైతన్య మరో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్న అభిమానుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. చైతన్య మరో పెళ్లి చేసుకుని అభిమానులకు శుభవార్త చెబుతారో లేదో చూడాలి. సోషల్ మీడియాలో తన గురించి ప్రచారంలోకి వచ్చే వార్తలను ఆమె పట్టించుకోరని సమాచారం.