ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. బన్నీ భార్య స్నేహారెడ్డికి కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ప్రముఖులలో స్నేహారెడ్డి ఒకరు కావడం గమనార్హం. బన్నీ భార్య అయిన స్నేహారెడ్డి గురించి అభిమానులకు పెద్దగా తెలియదు. సినిమా ఇండస్ట్రీకి ఆమె దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.
బన్నీ, స్నేహారెడ్డి ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే వీళ్ల ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారడం సులువుగా జరగలేదని సమాచారం. ఎన్నో ఇబ్బందులను అధిగమించి స్నేహారెడ్డి బన్నీ వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. స్నేహారెడ్డి కుటుంబ సభ్యుల నుంచి ఆమోదం లభించలేదని అయితే తర్వాత వాళ్లు కూడా ఒప్పుకున్నారని సమాచారం అందుతోంది.
స్నేహారెడ్డి అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదివారని సమాచారం. చిన్నప్పటి నుంచి స్నేహారెడ్డి చదువులో చురుకుగా ఉండేవారని ఆమె ఎంతో తెలివైన విద్యార్థి అని తెలుస్తోంది. సొంతంగా స్నేహారెడ్డి కుటుంబానికి ఇంజనీరింగ్ కాలేజ్ ఉండగా ఆ కాలేజ్ అభివృద్ది కోసం స్నేహారెడ్డి తన వంతు సహకారం అందించారు. కాలేజీలకు సంబంధించిన స్పెక్ట్రమ్ అనే మ్యాగజైన్ కు స్నేహారెడ్డి చీఫ్ ఎడిటర్ గా పని చేశారని బోగట్టా.
బన్నీ కంటే స్నేహారెడ్డి ఎక్కువ చదువుకున్నారు. అర్హకు ఈ స్థాయిలో గుర్తింపు రావడం వెనుక స్నేహారెడ్డి కృషి ఎంతో ఉంది. అయితే బన్నీ స్నేహారెడ్డి నుంచి రూపాయి కూడా కట్నంగా తీసుకోలేదని సమాచారం అందుతోంది. స్నేహారెడ్డికి సొంతంగా వ్యాపారాలు ఉన్నాయి. స్నేహారెడ్డి కెరీర్ పరంగా మరెన్నో విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.