బాలయ్య సినిమాను మధ్యలో ఆపేసి వెళ్లిపోయిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

స్టార్ హీరో బాలకృష్ణతో ఒక్క సినిమా అయినా చేయాలని ఆశపడే స్టార్ డైరెక్టర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. బాలయ్య సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ వస్తే ఆ సినిమాను వదులుకోవడానికి దర్శకులు దాదాపుగా ఇష్టపడరు. అయితే బాలయ్య సినిమాను మధ్యలో ఆపేసి వెళ్లిపోయిన డైరెక్టర్ల జాబితా కూడా ఎక్కువగానే ఉంది. బాలయ్య సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో నిప్పురవ్వ ఒకటి.

చాలారోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది. నిప్పురవ్వ షూటింగ్ ఎంతసేపటికీ పూర్తికాకపోవడంతో నాకు బయట వేరే సినిమాల ఆఫర్లు వస్తున్నాయని ఈ సినిమా షూటింగ్ ఎంతకూ పూర్తి కావడం లేదని ఆయన బాలయ్యను అడగగా బాలయ్య మీరు లేకుండా ఎలా అని చెప్పడంతో పాటు మీరు మీ సినిమాలు చేసుకోవాలని ఈ సినిమా షూటింగ్ ను తర్వాత పూర్తి చేద్దామని కోదండరామిరెడ్డికి చెప్పారు.

రెండేళ్ల గ్యాప్ తర్వాత కోదండరామిరెడ్డిని సినిమా చేయాలని కోరగా కోదండరామిరెడ్డి వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో సినిమాను షూట్ చేయడానికి అంగీకరించలేదు. ఈ రీజన్ వల్ల బాలయ్య కోదండరామిరెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందని సమాచారం. ఆ తర్వాత వేరే దర్శకుడు ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. దర్శకులు మారడం ఈ సినిమా కథ, రిజల్ట్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది.

ఈ సినిమాకు పోటీగా బాలయ్య బంగారు బుల్లోడు రిలీజ్ కావడంతో సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ వల్ల బాలయ్య, విజయశాంతి మధ్య దూరం పెరిగిందని కూడా వార్తలు వచ్చాయి. చిరంజీవి సినిమాతో బిజీగా ఉండటం వల్లే కోదండరామిరెడ్డి నిప్పురవ్వ షూటింగ్ ను పూర్తి చేయలేదు. ఒకవేళ కోదండరామిరెడ్డి ఈ సినిమాకు పూర్తిస్థాయిలో దర్శకత్వం వహించి ఉంటే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.