అరుంధతి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క సినీ కెరీర్ లో అరుంధతి సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. అరుంధతి సినిమాలో అనుష్క నటనను చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించడం గమనార్హం. అనుష్క అభిమానులతో పాటు సాధారణ ఫ్యాన్స్ కు కూడా ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది.

ఈ సినిమాలో పశుపతి పాత్రకు సోనూసూద్ తన నటనతో ప్రాణం పోశారు. ప్రేక్షకుల అంచనాలకు అందని కథ, కథనంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఏడు విభాగాలలో నంది అవార్డులను సొంతం చేసుకోవడం గమనార్హం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి తను విన్న ఒక కథలో కీలక మార్పులు చేసి తన టీం సహాయంతో అరుంధతి సినిమా స్క్రిప్ట్ ను తయారు చేయించారు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం మమతా మోహన్ దాస్ ను సంప్రదించారు.

అందంగా కనిపించడంతో పాటు ఎక్కువ ఎత్తు ఉన్న నటి కావడంతో ఆమెను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేయాలని మేకర్స్ భావించారు. అయితే కొంతమంది చెప్పిన మాటలు విని మమతా మోహన్ దాస్ ఈ సినిమాకు నో చెప్పారు. అనుష్కకు ఈ సినిమాలో ఛాన్స్ దక్కగా రాజమౌళి సూచనను అనుసరించి అనుష్క ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పడం గమనార్హం.

అన్నపూర్ణ స్టూడియో, బనగానపల్లె ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్తుకుంది. 14.5 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. 35 ప్రింట్లతో రిలీజైన ఈ సినిమా తర్వాత రోజుల్లో 360 ప్రింట్లకు పెరిగి 2009 సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అనుష్క కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకం అని చెప్పాలి.