ఆత్మహత్యకు మూడురోజుల ముందు సిల్క్ స్మిత ఏం చేసిందో తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో విజయలక్ష్మి(సిల్క్ స్మిత) ఒకరనే సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, ఇతర భాషల్లో 200కు పైగా సినిమాలలో నటించి సిల్క్ స్మిత ప్రశంసలు అందుకున్నారు. గ్లామరస్ రోల్స్ లో నటించి సిల్క్ స్మిత అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. అలనాటి స్టార్ హీరోల సినిమాలలో సిల్క్ స్మిత కీలక పాత్రల్లో నటించారు.

ఎంతోమంది స్టార్ హీరోలకు సిల్క్ స్మిత ధీటుగా నటించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన సిల్క్ స్మిత కడు పేద కుటుంబానికి చెందినవారు. చిన్న వయస్సులోనే సిల్క్ స్మితకు పెళ్లి జరిగింది. మేకప్ వేసే అమ్మాయిగా కెరీర్ ను మొదలుపెట్టిన సిల్క్ స్మిత ఊహించని విధంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాకే సిల్క్ స్మిత 5000 రూపాయలు అడ్వాన్స్ తీసుకోవడం గమనార్హం.

విజయలక్ష్మి పేరు తర్వాత రోజుల్లో సిల్క్ స్మితగా మారింది. అయితే కొన్ని మలయాళ సినిమాల్లో నటించడం సిల్క్ స్మిత కెరీర్ కు మైనస్ అయింది. కొంతమంది డైరెక్టర్లు నటిగా మంచి పాత్రలు ఇచ్చి ఆమెను ప్రోత్సహించారు. యూత్ లో సిల్క్ స్మితకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. పెద్దగా డ్యాన్స్ రాకపోయినా సిల్క్ స్మిత కెరీర్ విషయంలో అంతకంతకూ ఎదిగారు. సిల్క్ స్మిత డబ్బు విషయంలో మోసపోయారు.

ప్రేమ పేరుతో ఒక వ్యక్తి సిల్క్ స్మితను మోసం చేశారు. తాగుడుకు బానిస కావడం ఆమె కెరీర్ కు మైనస్ అయింది. డబ్బులు కొంతమందికి చెల్లించాల్సి ఉండటంతో ఒత్తిడికిలోనై ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడానికి మూడు రోజుల ముందు వరకు స్మిత ఎక్కువ మొత్తంలో మద్యం తాగారని అలా తాగడం ఆమె ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిందని సమాచారం అందుతోంది. గుడ్డిగా అందరినీ నమ్మడం చదువు లేకపోవడం ఆమెకు మైనస్ అయింది.