Pragathi: ప్రగతి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సహాయ నటి ప్రగతి గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమ్మగా , పిన్నిగా, అత్తగా, అక్కగా ఇలా ఎన్నో పాత్రలను పోషించి తన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది . ప్రగతి సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు బిజీగా అంటూ ఉంటూ తన ఫొటోస్ డాన్స్ వీడియోస్ వర్కౌట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది .
ప్రగతి చదువుకునే రోజుల్లో మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి ప్రకటనల్లో నటించింది. ఆ యాడ్స్‌లో ప్రగతిని చూసిన తమిళ దర్శకుడు కె.భాగ్యరాజ్ తన సినిమా `వీట్ల విశేషంగా`లో హీరోయిన్‌గా అవకాశం కల్పించారు. ఈ సినిమా తర్వాత వరుసగా తమిళ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . ఈ తరుణంలో తను 20 సంవత్సరాల వయసులో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యాను. పెళ్లి చేసుకున్న తర్వాత బాధ్యతలు పెరిగి డబ్బు సంపాదించడానికి మళ్లీ ఇండస్ట్రీకి తిరిగి రావాల్సి వచ్చింది. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం తాను చేసిన అతి పెద్ద పొరపాటని ప్రగతి ఇప్పటికీ పలు ఇంటర్వ్యూల్లో చెబుతూ బాధ పడుతుంటుంది. అలాగే ఎవరైనా సరే తమ కాళ్ల మీద తాము సంపాదించుకునే స్థాయికి ఎదిగే వరకు పెళ్లి చేసుకోకూడదని ఆమె చెబుతుంటుంది.
అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రగతి సహాయ నటిగా నటించి మంచి విజయం సాధించింది .ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులకు చీరకట్టులో ఎంతో సంప్రదాయంగా కనిపించే ప్రగతి.. గతేడాది లాక్డౌన్ సమయంలో తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా జిమ్‌లో కష్టతరమైన వర్కవుట్స్ చేస్తుంది. ఈ వీడియోస్ అన్నింటిని సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది .