175 రోజులకు పైగా ప్రదర్శించబడి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలివే?

ప్రస్తుతం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా రెండువారాల కంటే ఎక్కువ రోజులు థియేటర్లలో ప్రదర్శించబడటం కష్టమవుతోంది. అయితే కొన్నేళ్ల క్రితం పెద్ద సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే175 రోజులకు పైగా ప్రదర్శించబడిన సందర్భాలు ఉన్నాయి. అలా 175 రోజులకు పైగా ఆడి సంచలనాలు సృష్టించిన సినిమాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఏఎన్నార్ నటించిన బాలరాజు సినిమా 175 రోజుల పాటు ప్రదర్శించబడింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించగా సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి సినిమా ఈ రికార్డ్ ను బ్రేక్ చేసింది. 13 కేంద్రాలలో ఈ సినిమా 175 రోజుల పాటు ఆడింది. అయితే సువర్ణ సుందరి సినిమా ఈ రికార్డును బ్రేక్ చేసింది. జగదేక వీరుని కథ, పెళ్లి కానుక, మాయాబజార్ సినిమాలు కూడా 175 రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శించబడ్డాయి. అయితే లవకుశ సినిమా 175 రోజుల పాటు 14 కేంద్రాలలో ఆడి రికార్డును క్రియేట్ చేసింది.

అడవిరాముడు సినిమా కూడా 175 కేంద్రాలలో ఆడింది. అయితే లవకుశ రికార్డ్ ను మాత్రం ఈ సినిమా బ్రేక్ చేయలేదు. ఏఎన్నార్ నటించిన ప్రేమాభిషేకం సినిమాతో ఈ రికార్డ్ బ్రేక్ కావడం గమనార్హం. 19 కేంద్రాలలో ఈ సినిమా 175 రోజుల పాటు ప్రదర్శించబడటం గమనార్హం. పెళ్లి సందడి సినిమా ఈ రికార్డును బ్రేక్ చేసింది. సమరసింహారెడ్డి, నువ్వే కావాలి, నరసింహనాయుడు, కలిసుందరాంరా సినిమాలు కూడా సిల్వర్ జూబ్లీని జరుపుకున్నాయి.

ఇంద్ర సినిమా సమరసింహారెడ్డి రికార్డును బ్రేక్ చేయగా సింహాద్రి సినిమా ఆ రికార్డును బ్రేక్ చేసింది. 52 కేంద్రాలలో ఈ సినిమా 175 రోజులు ప్రదర్శించబడింది. పోకిరి సినిమా 48 కేంద్రాలలో 175 రోజుల పాటు ప్రదర్శించబడటం గమనార్హం. ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో సినిమాలు రిలీజవుతూ ఉండటంతో ఈ రికార్డులు బ్రేక్ కావడం కష్టమవుతోంది.